శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 30 డిశెంబరు 2022 (10:35 IST)

కారు ప్రమాదం.. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిన రిషబ్ పంత్

Rishab pant
Rishab pant
ఉత్తరాఖండ్ లోని రూర్కే సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో భారత వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్  తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చేరాడు. పంత్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) అధ్యక్షుడు వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశారు. 
 
కానీ అతని గాయం తీవ్రత ఎంతవరకు ఉందో ఇంకా తెలియ రాలేదు. శుక్రవారం తెల్లవారుజామున పంత్ ఢిల్లీకి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే అతన్ని స్థానిక డెహ్రాడూన్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. జనవరి 3 నుంచి శ్రీలంకతో జరిగే టీ20, వన్డే సిరీస్ లకు పంత్ కు భారత జట్టులో చోటు దక్కలేదు.