గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 డిశెంబరు 2022 (12:14 IST)

బంగ్లాతో వన్డే సిరీస్‌కు దూరమైన రిషబ్ పంత్

rishab panth
బంగ్లాదేశ్ జట్టుతో భారత్ మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో తలడనుంది. ఇందుకోసం భారత్ ఢాకాకు వెళ్లింది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి వన్డే మ్యాచ్ ఆదివారం జరుగనుంది. ఈ వన్డే మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పేసర్ మహ్మద్ షమీ జట్టుకు దూరం కాగా, తాజాగా రిషబ్ పంత్ కూడా తప్పుకున్నాడు. 
 
బీసీసీఐ వైద్య బృందం సలహా మేరకు రిషబ్ పంత్‌ను తొలి వన్డే మ్యాచ్‌ నుంచి తప్పించినట్టు బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. అయితే, వైద్య నివేదిక తర్వాత టెస్ట్ సిరీస్కోసం తిరిగి జట్టులో కలుస్తాడని బీసీసీఐ తెలిపింది. పంత్ స్థానంలో మరే ప్లేయర్‌ను జట్టులోకి తీసుకోలేదని వెల్లడించింది. అయితే, పంత్‌ గాయం గురించి మాత్రం వెల్లడించలేదు. అదేవిధంగా స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ తొలి వన్డేకు దూరమయ్యాడు. 
 
మరోవైపు, ఢాకా వేదికగా ప్రారంభమైన తొలి వన్డేలో భారత్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. భారత జట్టులో కుల్దీప్ సేన్‌కు అరంగేట్రం చేసే అవకాశం కల్పించింది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లను తీసుకుంది. కీపర్‌గా కేఎల్ రాహుల్‌కు బాధ్యతలు అప్పగించింది. 
 
ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన తుది జట్ల వివరాలను పరిశీలిస్తే, 
 
భారత్ : రోహిత్ శర్మ, ధావన్, కోహ్లీ, శ్రేయాస్, రాహుల్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ సేన్
 
బంగ్లాదేశ్ జట్టు : లిటన్ దాస్, అనముల్ హక్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, షకీబ్ అల్ హాసన్, ముష్పికర్ రహీం, మహ్మదుల్లా, అఫీఫ్ హొస్సేన్, మొహిదీ హాసన్ మిరాజ్. హాసన్ మహ్మద్, ముస్తాఫిజ్ రహ్మాన్, ఎబాడట్ హుస్సేన్.