ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 14 డిశెంబరు 2022 (14:03 IST)

భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ సరికొత్త రికార్డు

rishabh panth
భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. తద్వారా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సరసన చేరాడు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో వికెట్ కీపర్‌గా 4 వేల పరుగులు సాధించిన రెండో భారత్ వికెట్ కీపర్‌గా పంత్ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో పంత్ 46 పరుగులు సాధించి మెహిదీ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. 
 
అయితే, ధోనీ రికార్డుతో పోల్చితే పంత్ రికార్డు చాలా చిన్నది. ధోనీ ఏకంగా 535 మ్యాచ్లలో 17092 పరుగులు చేయగా, స్ట్రైక్ రేట్ 44.74 శాతంగా ఉంది. ఇందులో 15 సెంచరీలు, 108 అర్థ సెంచరీలు ఉన్నాయి. 
 
ఇక రిషబ్ పంత్ విషయానికి వస్తే ఇప్పటివరకు 128 మ్యాచ్‌లు ఆడి 4021 పరుగులు మాత్రే చేశాడు. స్ట్రైక్ రేట్ 33.78 శాతంగా ఉంది. ఇందులో వికెట్ కీపర్‌గా సాధించిన పరుగులు చూస్తే మాత్రం 109 మ్యాచ్‌లకు గాను 3651 పరుగులు చేశాడు.