ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 26 మార్చి 2020 (10:41 IST)

స్విజ్ మాస్టర్ అదుర్స్.. కరోనా కంట్రోల్‌కు రూ.7.75కోట్ల సాయం

స్విజ్ మాస్టర్, టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ కరోనా నియంత్రణ కోసం తన వంతు సాయంగా రూ.7.75 కోట్ల విరాళం ప్రకటించాడు. తన భార్య మిర్కా, తాను వ్యక్తిగతంగా ఈ మొత్తాన్ని విరాళంగా ఇస్తున్నట్టు ఫెదరర్ ప్రకటించాడు. కోవిడ్-19 ఇప్పుడు అందరికీ సవాలుగా మారిందని, ఎవరూ తప్పించుకోవడానికి వీల్లేకుండా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు.
 
కాగా, స్విట్జర్లాండ్‌లోనూ కరోనా వైరస్ తన ప్రభావాన్ని చూపిస్తోంది. బుధవారం రాత్రి నాటికి అక్కడ మృతి చెందిన వారి సంఖ్య 86కు చేరుకుంది. కరోనా కేసులు ఎక్కువగా నమోదైన టాప్-10 దేశాల్లో స్విట్జర్లాండ్ కూడా ఉంది. ఇప్పటి వరకు 8,800 కరోనా నిర్ధారిత కేసులు నమోదయ్యాయి.
 
ఇకపోతే.. స్పెయిన్‌లో కరోనా మరణాలు పెరుగుతున్నాయి. బుధవారం ఒక్క రోజే అక్కడ ఏకంగా 738 మందిని కరోనా బలితీసుకున్నట్టు స్థానిక పత్రికలు తెలిపాయి. స్పెయిన్‌లో ప్రస్తుత పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మరణాల్లో ఆ దేశం చైనాను దాటిపోయింది. 
 
చైనాలో 3,285 మంది మాత్రమే మరణించగా, స్పెయిన్‌లో ఏకంగా 3,434 మంది కరోనా కాటుకు బలయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 16 వేలు దాటిపోయింది. 4.40 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి.