ఆదివారం, 12 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 15 డిశెంబరు 2017 (13:04 IST)

కోహ్లీ- అనుష్క ఎక్కువ మంది పిల్లలను కనాలి: డివిలియర్స్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు వివాహ జీవితంలోకి అడుగెట్టిన సంగతి తెలిసిందే. వీరికి ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న నేపథ్యంలో.. దక్షిణాఫ్రికా క్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు వివాహ జీవితంలోకి అడుగెట్టిన సంగతి తెలిసిందే. వీరికి ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న నేపథ్యంలో.. దక్షిణాఫ్రికా క్రికెటర్ డివిలియర్స్ కోహ్లీకి శుభాకాంక్షలతో పాటు ఓ వీడియోను పోస్ట్ చేసి షాక్ ఇచ్చాడు. తన అధికారిక యాప్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
 
కోహ్లీ- అనుష్క వివాహబంధంతో ఒక్కటయ్యారు. వారికి అభినందనలు. పెళ్లి చేసుకుని ఏదో ఓ రోజు షాకిస్తాడనుకున్నాను. అనుకున్నట్లే షాకిచ్చాడు.  మంచి స్నేహితుడికి అభినందనలు అంటూ వ్యాఖ్యానించాడు. ఇంకా విరుష్క ఆనందకరమైన జీవితం కొనసాగిస్తారని.. ఎక్కువ మంది పిల్లలను కంటారని ఆశిస్తున్నట్లు వీడియోలో తెలిపారు. 
 
కోహ్లీ, డివిలియర్స్ ఐపీఎల్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా విరాట్ కోహ్లీ- అనుష్క జంట ఈ నెల 11న ఇటలీలో వివాహం చేసుకున్న సంగతి విదితమే.