శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 30 జూన్ 2024 (14:14 IST)

వరల్డ్ కప్ గెలిచిన ఆనందం.. పిచ్‌పై ఇసుకను నోట్లో వేసుకున్న కెప్టెన్ రోహిత్!!

rohith sharma
ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌ను భారత క్రికెట్ జట్టు గెలుచుకుంది. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత భావోద్వేగంతో కెప్టెన్ రోహిత్ శర్మ ఉప్పొంగిపోయారు. పిచ్‌పై ఉన్న మమకారంతో పిచ్‌పై ఉన్న ఇసుకను నోట్లో వేసుకున్నాడు. శనివారం రాత్రి ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా, బార్బడోస్ వేదికగా భారత్, సౌకాఫ్రికా జట్ల మధ్య ఫైనల్ పోరు జరిగింది. మ్యాచ్ విజయానంతరం కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర భావద్వేగానికి గురయ్యాడు. ఆనంద బాష్పాలు కార్చాడు. 
 
భావోద్వేగానికి గురైన కెప్టెన్ రోహిత్ విజయ క్షణాలను ఎప్పటికీ తనలో భాగం చేసుకుంటూ ఫైనల్ మ్యాచ్‌పై వేదికైన బార్బడోస్ పిచ్‌పై మమకారం చూపించాడు. పిచ్‌పై ఇసుకను నోట్లో వేసుకున్నాడు. రెండు సార్లు చాలా తక్కువ మోతాదులో చేతితో తీసి నోట్లో వేసుకున్నాడు. సహచర ఆటగాళ్లు, ఇతర సిబ్బంది అందరూ ఆనంద బాష్పాలు కారుతున్న వేళ రోహిత్ ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
 
కాగా ఫైనల్ మ్యాచ్ గెలుపు అనంతరం మీడియా సమావేశంలో రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పాడు. ఈ మేరకు తన రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతకుముందే విరాట్ కోహ్లీ ప్రకటనను ప్రస్తావిస్తూ తనకు కూడా ఇదే మ్యాచ్ అని క్లారిటీ ఇచ్చాడు. ఈ ఫార్మాట్లో ఆడటం మొదలుపెట్టిన నాటి నుంచి ఆస్వాదిస్తున్నానని, ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికేందుకు ఇంతకంటే మంచి సమయం ఉండదని అన్నాడు. ఈ మ్యాచ్‌లో ప్రతి క్షణాన్ని ఆస్వాదించానని, తాను కోరుకున్నది ఇదేనని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా సహచర ఆటగాళ్లందరికీ సెల్యూట్ చేసి రోహిత్ శర్మ చప్పట్లు కొట్టి అభినందించాడు.