శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 10 సెప్టెంబరు 2017 (16:35 IST)

ఆస్ట్రేలియాతో క్రికెట్ సిరీస్: తొలి 3 వన్డేలకు టీమిండియా జట్టు ప్రకటన

ఆస్ట్రేలియాతో జరుగనున్న తొలి మూడు వన్డేల్లో ఆడే భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ నెల 17 నుంచి అక్టోబర్‌ 13 వరకూ ఆసీస్‌.. భారత్‌లో పర్యటించనుంది. తొలి వన్డే 17న చెన్నై వేదికగా జరగనుంది.

ఆస్ట్రేలియాతో జరుగనున్న తొలి మూడు వన్డేల్లో ఆడే భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ నెల 17 నుంచి అక్టోబర్‌ 13 వరకూ ఆసీస్‌.. భారత్‌లో పర్యటించనుంది. తొలి వన్డే 17న చెన్నై వేదికగా జరగనుంది. 
 
ఆస్ట్రేలియాతో భారత్‌ మొత్తం ఐదు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ జట్టులో ఫాస్ట్‌ బౌలర్లు ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ తిరిగి జట్టులో చోటు సంపాదించుకోగా, స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజాలకు చోటు దక్కలేదు.
 
జట్టు వివరాలను పరిశీలిస్తే... శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), రహానే, మనీశ్‌పాండే, కేదార్‌ జాదవ్‌, ధోనీ(వికెట్‌ కీపర్‌), హర్దిక్‌ పాండ్యా, అక్షర్‌ పటేల్‌, చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, ఉమేశ్‌ యాదవ్‌, మహమ్మద్‌ షమీ.