శుక్రవారం, 15 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ప్రస్తుత సిరీస్
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 20 జులై 2017 (05:49 IST)

గొప్పతనమంతా ఆటగాళ్లదే. కోచ్‌లు ఎవరైనా అలా వచ్చి వెళుతుంటారు: రవిశాస్త్రి

భారత క్రికెట్‌ వ్యవస్థలో ఎంతో మంది వచ్చి వెళుతుంటారని, వారికంటే ఆట ముఖ్యమని టీమిండియా కొత్త కోచ్ రవిశాస్త్రి అన్నారు. కోచ్‌లకంటే కూడా ఆటగాళ్లు కీలకమని స్పష్టం చేశారు. టీమిండియా కోచ్ ఎవరైనా కావచ్చు.. రవిశాస్త్రి, కుంబ్లే మరెవరైనా సరే టీమ్‌లోకి వచ్చి వ

భారత క్రికెట్‌ వ్యవస్థలో ఎంతో మంది వచ్చి వెళుతుంటారని, వారికంటే ఆట ముఖ్యమని టీమిండియా కొత్త కోచ్ రవిశాస్త్రి అన్నారు. కోచ్‌లకంటే కూడా ఆటగాళ్లు కీలకమని స్పష్టం చేశారు. టీమిండియా కోచ్ ఎవరైనా కావచ్చు.. రవిశాస్త్రి, కుంబ్లే మరెవరైనా సరే టీమ్‌లోకి వచ్చి వెళుతుంటారు అంతే తప్ప ఆటగాళ్లే ఎప్పుడైనా కీలకమని విజయాలైనా, అపజయాలైనా ఆటగాళ్ల శ్రమే కారణమన్నారు. కోచ్ ఎవరు వచ్చినా, వెళ్లినా భారత క్రికెట్ స్వరూపం మారదని రవిశాస్త్రి తేల్చి చెప్పారు. 
 
శ్రీలంక పర్యటనకు టీమిండియాతో కలిసి కోచ్‌గా వెళ్లిన రవిశాస్త్రి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇటీవల జరిగిన పరిణామాలపై నేరుగానూ, పరోక్షంగానూ వ్యాఖ్యానించాడు. ‘ఇటీవలి ఘటనల బరువును నా నెత్తిన పెట్టుకొని నేను రాలేదు. గత మూడేళ్లుగా భారత జట్టు చాలా బాగా ఆడుతోంది. గొప్పతనమంతా ఆటగాళ్లదే. రవిశాస్త్రి కావచ్చు, కుంబ్లే కావచ్చు ఎవరైనా వచ్చి వెళుతుంటారు. భారత్‌ నంబర్‌వన్‌ అయిందంటే అది ఆటగాళ్ల శ్రమ వల్లే తప్ప కోచ్‌ల వల్ల కాదు. ఎవరు ఉన్నా లేకున్నా భారత క్రికెట్‌ స్వరూపంలో మార్పుండదు’ అని శాస్త్రి వ్యాఖ్యానించారు.
 
గతంలో శ్రీలంకలో పర్యటించడంతో పోలిస్తే తనలో చాలా మార్పు వచ్చిందని, గత మూడు వారాల్లో అయితే తాను మరింత పరిణతి చెందానని ఆయన చెప్పారు. తాను పట్టుబట్టి తీసుకున్న బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌పై శాస్త్రి ప్రశంసలు కురిపించారు. ‘దాదాపు పదిహేనేళ్లు ఆయన కోచింగ్‌లోనే గడిపారు. ఇండియా ‘ఎ’, అండర్‌–19 స్థాయిలో అరుణ్‌ మంచి ఫలితాలు సాధించారు. 2015 వరల్డ్‌ కప్‌లో మన బౌలర్లు ఎనిమిది మ్యాచ్‌లలో 77 వికెట్లు తీశారు. ఆటగాడిగా చెప్పుకోదగ్గ రికార్డు లేకపోవడం వల్లే ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదు. లేకపోతే అతని గురించి గొప్పగా చెప్పేవారు. నేను చెప్పడంకంటే అంతా అతడి పనితీరును చూస్తే బాగుంటుంది’ అని హెడ్‌ కోచ్‌ సమర్థించారు.
 
భారత సహాయక సిబ్బంది ఎంపికకు సంబంధించి రవిశాస్త్రి, బీసీసీఐ ప్రత్యేక కమిటీ మధ్య జరిగిన చర్చల గురించి ఒక ఆసక్తికర అంశం తాజాగా వెలుగులోకి వచ్చింది. జట్టు సలహాదారుడిగా దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఉంటే బాగుంటుందని ఈ సమావేశంలో శాస్త్రి సూచించారు. అదే జరిగితే సచిన్‌ ‘కాన్‌ఫ్లిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌’ పరిధిలోకి వచ్చే అవకాశం ఉండేది. తాత్కాలిక ప్రాతిపదికన కొద్ది రోజుల కోసం సలహాదారుడిగా పని చేసినా... సచిన్‌ ఐపీఎల్‌ సహా తన ఇతర అనేక ఒప్పందాలకు దూరం కావాల్సి ఉంటుంది. దాంతో ఈ ప్రతిపాదనకు బీసీసీఐ కమిటీ బ్రేక్‌ వేసింది. 
 
జహీర్ ఖాన్, రాహుల్ ద్రవిడ్‌లను బౌలింగ్, బ్యాటింగ్ కోచ్‌లుగా తీసుకోవడానికి ససేమిరా అన్న రవి ముంబైకి చెందిన సచిన్‌ టెండూల్కర్‌ని మాత్రం సలహాదారుగా తీసుకోవాలని ప్రయత్నించడం గమనార్హ. జహీర్, రాహుల్‌కు సాధ్యపడనిది సచిన్ ఏం ఊడబొడుస్తాడో మరి.