శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 5 ఆగస్టు 2018 (15:13 IST)

సచిన్ తర్వాత కోహ్లీకి అరుదైన గౌరవం.. ఏంటది?

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి టెస్టుల్లో అగ్రస్థానం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించిన ర్యాంకుల పట్టికలో కోహ్లీ మొదటి స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి టెస్టుల్లో అగ్రస్థానం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించిన ర్యాంకుల పట్టికలో కోహ్లీ మొదటి స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు ఎడ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో కోహ్లీ సేన ఓడిపోయింది. కానీ, ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాడు.
 
ఈ నేపథ్యంలో తాజాగా విడుదల చేసిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా అటగాడు స్టీవ్‌ స్మిత్‌ను దాటేసి తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. గత 32 నెలలుగా తొలి స్థానంలో కొనసాగుతున్న స్టీవ్‌ స్మిత్‌(929 పాయింట్లు)ను 5 పాయింట్లతో కోహ్లీ(934 పాయింట్లు) వెనక్కి నెట్టాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టెస్టుల్లో నంబర్‌వన్‌ స్థానానికి చేరుకోవడం కోహ్లీ కెరీర్‌లో ఇదే తొలిసారి. సచిన్‌ (2011) తర్వాత ఈ రికార్డు అందుకుంది కోహ్లీనే కావడం గమనార్హం.