శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శనివారం, 27 అక్టోబరు 2018 (12:01 IST)

వెస్టిండీస్ ఆనందం అలా వుంది..

వెస్టిండీస్‌తో చివరి మూడు వన్డేలకు పేస్ బౌలర్లు భువనేశ్వర్, జస్ ప్రీత్ బుమ్రాలను భారత జట్టు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. వీరిని జట్టులోకి తీసుకోవడంపై వెస్టిండీస్ కోచ్ స్టువర్ట్ స్పందించాడు. తమ బలాన్ని చూసి భారత్... తన ప్రధాన బౌలర్లను తిరిగి తీసుకొచ్చిందన్నాడు. 
 
తొలి మ్యాచ్‌లో భారత బౌలర్లు 320 పరుగులు సమర్పించుకున్నారని గుర్తు చేశాడు. ఆత్మరక్షణలో పడిన టీమిండియా, మరోసారి అదే పరిస్థితి రాకూడదన్న ఆలోచనలోనే భువి, బుమ్రాలను జట్టులోకి తీసుకు వచ్చిందని, వారిని తమ ఆటగాళ్లు సమర్థవంతంగా ఎదుర్కోగలరని అన్నాడు. 
 
కాగా టీమిండియాతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా, తొలి వన్డేలో ఓటమి పాలై, రెండో వన్డేను విండీస్ డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో భారత జట్టు విశ్రాంతి ఇచ్చిన భువనేశ్వర్, బుమ్రా వంటి ప్రధాన బౌలర్లను తిరిగి జట్టులోకి తీసుకునేలా చేశామని, ఇది తమ విజయమేనని కోచ్ స్టువర్ట్ చెప్తున్నాడు.