ఆదివారం, 5 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (16:27 IST)

ధోనీ రిటైర్మెంట్ వార్తలు.. ఇందులో సస్పెన్స్ ఏమీ లేదన్న అయాజ్

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ మైదానంలో కనిపించట్లేదు. ప్రపంచ కప్ సెమీఫైనల్లో భారత జట్టు ఓటమి పొందడంతో ధోనీ రిటైర్మెంట్ తీసుకుంటారని ప్రచారం సాగుతోంది. కానీ విషయంలో ధోనీ మాత్రం నోరు మెదపట్లేదు. ఇంకా బీసీసీఐ కూడా మౌనంగా వుంటోంది. భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు, దక్షిణాఫ్రికాతో ప్రస్తుతం ఆడుతున్న టీ20 సిరీస్‌కు ధోనీ దూరంగా ఉన్నాడు. 
 
అయితే, ధోనీ ఆటలో కొనసాగుతాడా, లేదా అన్న విషయంలో సస్పెన్స్‌కు తావు లేదని క్రికెట్ విశ్లేషకుడు అయాజ్ మేమన్ అభిప్రాయపడ్డారు. ఆడాలా, లేదా అన్నది ధోనీ స్వయంగా తీసుకోవాల్సిన నిర్ణయమే. క్రికెట్‌కు వీడ్కోలు పలకాలనుకుంటే, అతడే ఆ విషయాన్ని అందరి ముందుకూ వచ్చి చెబుతాడు. ఇందులో సస్పెన్స్ ఏమీ లేదన్నాడు. 
 
కానీ కోహ్లీ పెట్టిన ఓ పోస్టు ధోనీ రిటైర్మెంట్ ఊహాగానాలకు బలమిచ్చింది. ధోనీతో కలిసి ఆడిన ఓ ఇన్నింగ్స్‌కు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో కోహ్లీ పోస్ట్ చేశాడు. ''ఈ మ్యాచ్‌ను ఎప్పటికీ మరిచిపోలేను. అదొక గొప్ప రోజు. ఫిట్‌నెస్ టెస్ట్ పెట్టినట్లు ధోనీ నన్ను పరుగెత్తించాడు'' అంటూ వ్యాఖ్యానించాడు. ప్రత్యేక సందర్భమేమీ లేకుండా కోహ్లీ ఈ ఫొటో షేర్ చేయడంతో చాలా మంది ధోనీ రిటైర్ అవబోతున్నాడేమోనని సందేహాలు వ్యక్తం చేశారు.
 
దీంతో ధోనీ క్రికెట్‌లో కొనసాగాలంటూ #NeverRetireDhoni #DhoniForever హ్యాష్‌ట్యాగ్‌లతో ట్వీట్లు వెల్లువెత్తాయి. అయితే, ఆ తర్వాత కాసేపటికి ధోనీ రిటైర్మెంట్ వార్తలన్నీ వదంతులేనంటూ అతడి భార్య సాక్షి సింగ్ ధోనీ ట్విటర్ వేదికగా స్పష్టతనిచ్చారు. టీమ్ ఇండియాకు ధోనీ అవసరం ఇంకా చాలా ఉంది. జట్టు కెప్టెన్ కోహ్లీ కూడా చాలా సార్లు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు.