శనివారం, 23 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 మార్చి 2022 (15:59 IST)

మహిళల ప్రపంచ కప్ : పాకిస్థాన్‌పై భారత్ విజయం

మహిళా ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఆదివారం జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టును భారత మహిళా జట్టు ఓడించింది. ఏకంగా 107 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. దీంతో పాయింట్ల పట్టికలో భారత్ అగస్థానాన్ని దక్కించుకుంది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లన నష్టానికి 244 పరుగుల భారీ స్కోరు చేసింది. న్యూజిలాండ్‌లోని మౌంట్ మాంగన్యూలో జరిగిన మ్యాచ్‌ జరిగింది. ఇందులో దీప్తి శర్మ (40), స్మృతి మంథాన (52), స్నేహా రాణా (53), వస్త్రాకర్ (6) చొప్పున పరుగులు చేశారు. 
 
ఆ తర్వాత 245 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి తిగిన పాకిస్థాన్ జట్టు కేవలం 137 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ సిద్ర అమీన్ మినహా ఏ ఒక్కరూ క్రీజ్‌లో కుదురుగా బ్యాటింగ్ చేయలేకపోయారు. దీంతో 43 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ నాలుగు వికెట్లు తీయగా, స్నేహా రాణా, ఝులన్ గోస్వామిలు రెండేసి వికెట్లు, మేఘనా సింగ్, దీప్తి శర్మ ఒక్కో వికెట్ చొప్పున తీశారు.