శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 ఆగస్టు 2022 (21:47 IST)

షేన్ వార్న్‌తో ఆ రాత్రంతా గడిపాను.. మోడల్ గినా స్టివార్ట్ (video)

Shane warne
Shane warne
ప్రముఖ మోడల్ గినా స్టివార్ట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. 51 ఏళ్ల వయస్సులోనూ హాట్‌గా కనిపించే ఈమె షేన్ వార్న్ తనకు సన్నిహితుడని తెలిపింది. థాయ్‌ల్యాండ్‌లో ఈ ఏడాది ఆరంభంలో ప్రపంచ క్రికెట్ దిగ్గజాల్లో ఒకడైన షేన్ వార్న్‌ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో షేన్ వార్న్‌తో తాను రహస్యంగా డేటింగ్ చేసినట్టు ఆమె ప్రకటించింది. ప్రపంచంలో అత్యంత ‘హాటెస్ట్ గ్రాండ్ మా’గా స్టివార్ట్ తనను తాను అభివర్ణించుకుంటుంది. షేన్ వార్న్ తనకు మంచి స్నేహితుడు, నమ్మకమైన వ్యక్తి అంటూ పేర్కొంది. అతడు ఎంతో మానవతావాది అనే చెప్పాలనుకున్నానని పేర్కొంది. 
 
ఈ విషయం గురించి బహిరంగంగా మాట్లాడడం ఇదే మొదటిసారిగా పేర్కొన్న స్టివార్ట్, అతడి అభినందనలకు తాను కట్టుబడి ఉంటానని, తన జీవితాన్ని ప్రైవేటుగానే ఉంచుతానని ప్రకటించింది.
 
షేన్ వార్న్ లేని లోటు తీరనిదని.. ప్రపంచం ఓ లెజెండ్‌ను కోల్పోయిందని.. నమ్మకమైన వ్యక్తి.. మంచి స్నేహితుడిని కోల్పోయానని స్టివార్ట్ తెలిపింది. 2018లో వార్న్ తో మొదటిసారి మాట్లాడానని, ఎన్నో సార్లు మెస్సేజ్‌లు చేసుకున్న తర్వాత గోల్డ్ కోస్ట్‌లో కలుసుకున్నామని వెల్లడించారు. ఆ రాత్రంతా గడిపామని స్టివార్ట్ చెప్పుకొచ్చింది.