శనివారం, 4 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 4 మార్చి 2022 (21:07 IST)

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ ఇకలేరు

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ (52) శుక్రవారం కన్నుమూశారు. ఫాక్స్ స్పోర్ట్స్‌కు ఈ వార్తను ధృవీకరిస్తూ, వార్న్ మేనేజ్‌మెంట్ వెల్లడించిన వివరాలు ఇలా వున్నాయి.
 
"షేన్ వార్న్ అతని విల్లాలో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వైద్య సిబ్బంది ఎంత ప్రయత్నించినప్పటికీ అతడిని రక్షించలేకపోయారు.". వార్న్ 708 టెస్ట్ మ్యాచ్ వికెట్లతో ఆల్ టైమ్ అత్యుత్తమ లెగ్ స్పిన్నర్.
 
వన్డేల్లో 293 వికెట్లు కూడా తీసుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో ఆస్ట్రేలియా తరపున 300 కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు. ఆస్ట్రేలియా దిగ్గజ క్రీడాకారుడు షేన్ మరణవార్త పట్ల క్రీడాలోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.