బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 డిశెంబరు 2021 (14:39 IST)

'నా సామి' సాంగ్‌కు స్టెప్పులు ఇరగదీసిన చాహల్ భార్య

chahal wife
బన్నీ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప తెరకెక్కిన సంగతి తెలిసిందే. పుష్ప సినిమా థియేటర్లలో రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సినిమాలో డైలాగులు, పాటలు ఫుల్ ఫేమస్ అయ్యాయి. 
 
క్రికెటర్లు, సినీ ప్రముఖులు పుష్ప మూవీలోని డైలాగులపై వీడియోలు, రీల్స్ చేస్తున్నారు. ప్పటికే పుష్ప సినిమాలోని డైలాగ్స్‌పై క్రికెటర్లు డేవిడ్​వార్నర్, రవీంద్ర జడేజాలు చేసిన రీల్స్​సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. 
 
తాజాగా టీమిండియా స్పిన్నర్ చాహల్ భార్య ధన​శ్రీ.. పుష్పలోని 'నా సామి' సాంగ్‌కు స్టెప్పులేస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ఆ పాటలో రష్మిక వేసిన స్టెప్పులను అనుసరిస్తూ చేసిన వీడియోకు అల్లు అర్జున్‌, రష్మిక ఫ్యాన్స్​కూడా ఫిదా అయిపోయారు. ఈ వీడియోలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.