ఆదివారం, 12 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : బుధవారం, 10 జులై 2019 (17:27 IST)

సెమీ ఫైనల్ మ్యాచ్ : టపటపా పడిపోతున్న వికెట్లు... భారత్‌కు ఓటమి తప్పదా?

మాంచెష్టర్ వేదికగా జరుగుతున్న తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓటమి దిశగా పయనిస్తోంది. ఆరంభం నుంచి క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోతోంది. ఈ క్రమంలో జట్టు స్కోరు 71 పరుగుల వద్ద ఉండగా, రిషబ్ పంత్ వికెట్‌ను కోల్పోయింది. దీంతో 22.5 ఓవర్లలో 71 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 
 
అంతకుముందు 240 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్....5 పరుగులకే మూడు ప్రధానమైన వికెట్లను కోల్పోయింది. ఓపెరనర్లు, రోహిత్ శర్మ (1), కేఎల్ రాహుల్ (1), కెప్టెన్ కోహ్లీ (1) చొప్పున పరుగులు చేశారు. ఆ తర్వాత రిషబ్ పంత్‌తో జతకట్టిన హార్దిక్ పాండ్యా జట్టు ఇన్నింగ్స్ పునర్మించే బాధ్యతను తీసుకున్నారు. 
 
ఈ క్రమంలో రిషబ్ పంత్ (32) భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద హెన్రీ బౌలింగ్‌లో నీషమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికి భారత్ స్కోరు 71 రన్స్. ప్రస్తుతం క్రీజ్‌లో హార్దిక్ పాండ్యా, ధోనీలు క్రీజ్‌లో ఉన్నారు. కివీస్ బౌలర్లలో హెన్రీ మూడు వికెట్లు తీయగా, బోల్ట్, సంత్నెర్‌లు తలా ఒక్కో వికెట్ చొప్పున తీశారు.