మంగళవారం, 26 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : ఆదివారం, 2 జూన్ 2019 (12:49 IST)

కోహ్లీకి తిట్లను భరించే శక్తి లేదు.. పరిపక్వత అస్సల్లేదు.. రబాడ

ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికా మ్యాచ్‌తో టీమిండియా జర్నీ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందే దక్షిణాఫ్రికా స్టార్‌ బౌలర్‌ కగిసో రబాడ మాటల యుద్దానికి తెరలేపాడు. టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. కోహ్లీ గొప్ప బ్యాట్స్‌మన్‌ అయినా.. అతడికి పరిపక్వత లేదంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. 
 
ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో కోహ్లీతో రబాడ వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. అయితే ఆ టోర్నీలో జరిగిన వివాదాన్ని తాజాగా వివరిస్తూ... 'ఐపీఎల్‌లో ఆరోజు వివాదానికి కారణం కోహ్లినే. ఓ మ్యాచ్‌ సందర్భంగా విరాట్‌ నా బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టాడు. అనంతరం నన్నేదో అన్నాడు. ఐతే నేను తిరిగి అతడిని అదే మాట అంటే కోపం తెచ్చుకున్నాడు' అని రబాడ తెలిపాడు.
 
విరాట్ కోహ్లీ ఉత్సాహం కోసం ప్రత్యర్థుల్ని ఏదో అంటాడు. కానీ తిరిగి ఎవరైనా ఏమన్నా అంటే తట్టుకోలేడు. విరాట్‌ గొప్ప బ్యాట్స్‌మన్‌ అయినా.. తిట్లను భరించే శక్తి అతడికి లేదు. కోహ్లీ ఇంకా పరిపక్వత సాధించాల్సి ఉంది. ఆట మాత్రమే కాదు వ్యక్తిత్వం కూడా ఉండాలని రబాడ చెప్పాడు.