కారు విండో గ్లాసులో తల ఇరుక్కుని చిన్నారి మృతి..ఎక్కడ?
కారు విండో గ్లాసులో తల ఇరుక్కుని ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన సూర్యాపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇంద్రజ అనే చిన్నారి కారు వెనుక సీటులో కూర్చుని తల బయటకు పెట్టి చూస్తోంది. దీన్ని డ్రైవర్ గమనించలేదు.
అంతేగాకుండా కారు విండో డోర్ కూడా క్లోజ్ చేశాడు. దీంతో కారు గ్లాస్ మధ్యలో మెడ ఇరుక్కుని చిన్నారి ఇంద్రజ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.