సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 18 సెప్టెంబరు 2021 (10:49 IST)

అత్యాచారం యత్నం విఫలం: చంపేసి శవంపై అత్యాచారం చేసాడు

అత్యాచార యత్నం విఫలం కావడంతో మహిళను చంపి ఆమె శవంపై అత్యాచారం చేసాడు ఓ కామాంధుడు. ఈ ఘోరం రాజస్థాన్‌లో జరిగింది. 19 ఏళ్ల యువకుడు అత్యాచారం చేయడంలో విఫలమైన తర్వాత 60 ఏళ్ల మహిళను హత్య చేశాడు. నిందితుడు మరణించిన మహిళ మృతదేహంపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
ఈ సంఘటన రాష్ట్రంలోని హనుమాన్‌గఢ్ జిల్లాలో జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, 19 ఏళ్ల యువకుడు పూటుగా మద్యం సేవించి మహిళ ఇంటిలోనికి ప్రవేశించాడు. తొలుత మహిళపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆమెను కొట్టి చంపేసి ఆ తర్వాత శవంపై అత్యాచారం చేశాడు.
 
మహిళ బావమరిది యువకుడిపై ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. 60 ఏళ్ల వృద్ధ మహిళ ఒంటరిగా నివశిస్తోంది. ఆమెకి పిల్లలు లేరు. అర్థరాత్రి సమయంలో నిందితుడు కుమార్ వృద్ధురాలి ఇంట్లోకి ప్రవేశించాడు. ఆమెపై అఘాయిత్యం చేయబోగా ప్రతిఘటించడంతో మంచంపైకి తోసి గొంతు కోసి చంపేసాడు. ఆ తర్వాత అత్యాచారం చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. యువకుడిని పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.