ఆదివారం, 13 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : బుధవారం, 8 ఫిబ్రవరి 2023 (10:25 IST)

మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ భార్య ఆత్మహత్య

suicide
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ నల్లమల్ల బాలకృష్ణ భార్య జ్యోతి (32) మంగళవారం తన ఇంట్లోనే ఉరేసుకున్నారు. బాలకృష్ణతో పాటు అతడి కుటుంబసభ్యుల వేధింపులతోనే తమ కుమార్తె బలవన్మరణానికి పాల్పడినట్లు జ్యోతి తల్లిదండ్రులు గంగవరపు రవీంధ్రకుమారి, రాంబాబులు ఆరోపించారు. 
 
తమకు మంగళవారం ఉదయం 9.30 గంటలకు ఫోన్‌ చేసి తన భర్త చంపేలా ఉన్నారని చెప్పినట్లు వారు పోలీసులకు తెలిపారు. మున్సిపల్‌ కమిషనర్‌గా ఎంపికైన తర్వాతి నుంచి వేధింపులకు గురిచేస్తున్నారని, ఇప్పుడు పెళ్లి చేసుకుంటే రూ.కోట్ల కట్నంతో పాటు అందమైన భార్య వస్తుందని పదేపదే వేధించేవారని తెలిపారు. ఇంట్లో శాడిస్ట్‌గా, సైకోగా ఉంటూ బయట మాత్రం మంచివాడిగా ప్రవర్తించేవారన్నారు. 
 
ఆ మేరకు ఫిర్యాదు చేయాలని మంచిర్యాల సీఐ నారాయణనాయక్‌ జ్యోతి కుటుంబసభ్యులకు సూచించగా తమ కుమార్తె మరణానికి కారణమైన బాలకృష్ణను తమకు అప్పగించాలని, అప్పటివరకు ఫిర్యాదు చేయబోమని గొడవకు దిగారు. బాలకృష్ణపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని సీఐ తెలపడంతో మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించడానికి వారు అంగీకరించారు.