జాతీయ రైతు దినోత్సవం ఎలా వచ్చింది..? రోడ్డుపై అన్నదాతల ఆందోళన
నేడు జాతీయ రైతు దినోత్సవం. ఈ రోజును ఎందుకు రైతు దినోత్సవంగా జరుపుకుంటారంటే.. చౌదరి చరణ్ సింగ్ భారత దేశానికి 5వ ప్రధాన మంత్రి. చౌదరి చరణ్ సింగ్ చేసిన అనేక ఉద్యమాల వల్ల జమీందరీ చట్టం రద్దు అయి కౌలుదారీ చట్టం అమలులోకి వచ్చింది.
రైతులకు బ్యాంకు రుణాలు అందించే విధానం ప్రవేశ పెట్టడం జరిగింది. రైతుల గురించి, వ్యవసాయ రంగం గురించి అంతగా ఆలోచించి, వారి సమస్యల పరిష్కారానికి చరణ్‌సింగ్ కృషి చేశారు. దీంతో చరణ్ సింగ్ రైతు బంధుగా పేరుతెచ్చుకున్నారు. చరణ్ సింగ్ సేవలకు గుర్తుగా ప్రభుత్వం ఆయన జన్మదినోత్సవం సందర్భంగా జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించింది. చరణ్ సింగ్ సమాధిని కిసాన్ ఘాట్ అని పిలుస్తారు. అంతర్జాతీయ వ్యవసాయదారుల దినోత్సవం ఏప్రిల్ 17న జరుపుతారు.
అయితే మనదేశం తమకంటూ ప్రత్యేకంగా వ్యవసాయదారుల దినోత్సవం ఉండాలనే లక్ష్యంతో చౌదరి చరణ్ సింగ్ జన్మదినోత్సవాన్ని ఎంచుకున్నారు. ఆయన పార్లమెంట్‌ని ఎదుర్కొలేకపోయి తాత్కాలిక ప్రధానిగానే 1980లోనే పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. చరణ్ సింగ్ రైతు నాయకుడిగానే 1987 మే 29న మరణించారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన చరణ్ సింగ్ .. రైతులకు చేసిన సేవలకు గుర్తుగా ఆయన జన్మదినం డిసెంబర్ 23న కిసాన్ దివస్ జాతీయ రైతు దినోత్సవంగా భారత దేశంలో జరుపుకొంటారు.
కాగా జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా అన్నదాతలకు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. రైతు దినోత్సవమని, ఇన్ని రోజులుగా అన్నదాతలు చేస్తున్న ఆందోళన ముగియవచ్చునని ఆశిస్తున్నట్టు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని వారిని గ్రీట్ చేస్తూ ఆయన.. ఈ దేశానికి వారు ఆహారాన్ని, భద్రతను ఇస్తున్నారని, ప్రభుత్వం వారి డిమాండ్ల విషయంలో పూర్తి బాధ్యతతో వ్యవహరిస్తోందని తెలిపారు.
రైతుల విషయంలో ప్రధాని మోదీ… మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్‌ను ఆదర్శంగా తీసుకున్నారని, అన్నదాతల మేలుకోసం కృషి చేస్తున్నారని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. చరణ్ సింగ్ జయంతిని పురస్కరించుకుని కూడా రాజ్ నాథ్ ఈ విషయాన్ని ప్రస్తావించారు.
ఇదిలా ఉంటే.. రైతులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. యూపీలో పిలిభిత్, మొరాదాబాద్‌లలో అన్నదాతలపై పోలీసుల చర్యను నిరసిస్తూ సింఘు బోర్డర్‌లో వారు నిరసనను ఉధృతం చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిష్టిబొమ్మను తగులబెడతామని హెచ్చరించారు. అటు-మొరాదాబాద్ లో 8 గంటల అనంతరం టోల్ ప్లాజాను రైతులు విముక్తం చేశారు. ఇన్ని గంటలపాటు వారు దీన్ని తమ ఆధీనంలో ఉంచుకున్నారు.