సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Modified: గురువారం, 10 మే 2018 (15:16 IST)

ఈసారి జగన్ మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయం... ఎందుకో తెలుసా?

భారతి.. వైఫ్‌ ఆఫ్‌ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వైసిపిలో జగన్ భార్య భారతి గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన మీడియా వ్యవహారాలను మాత్రమే చూస్తూ వచ్చిన భారతి వైసిపిలో కీలకం కానున్నారనేది ఇప్పుడు పార్టీలో చర్చిస

భారతి.. వైఫ్‌ ఆఫ్‌ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వైసిపిలో జగన్ భార్య భారతి గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన మీడియా వ్యవహారాలను మాత్రమే చూస్తూ వచ్చిన భారతి వైసిపిలో కీలకం కానున్నారనేది ఇప్పుడు పార్టీలో చర్చిస్తున్న అంశం. వచ్చే ఎన్నికల కంటే ముందుగానే భారతిని పార్టీలో కీలకం చేసే దిశగా జగన్ ప్రయత్నిస్తున్నారని వైసిపిలోనే ప్రచారం జరుగుతోంది. 
 
కొన్ని నెలల ముందు వరకు జగన్ భార్యగానే తెలిసిన భారతి.. అక్రమాస్తుల కేసుల ఆరోపణలతో జగన్ జైల్లో ఉన్న సమయంలో హఠాత్తుగా తెరపైకి వచ్చారు. జగన్ కేసులకు సంబంధించి నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పాటు విజయమ్మతో కలిసి భర్త అరెస్టుకు నిరసనగా ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించారు. 
 
జగన్ జైలు నుంచి బయటకు వచ్చాక పూర్తిస్థాయిలో జగన్ సొంత మీడియా వ్యవహారాలకే పరిమితమయ్యారు. జగన్ జైలుకు వెళ్ళినప్పుడు పార్టీకి సంబంధించి భారతి ఇన్వాల్వ్ అయిన సంధర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. ఇటీవల కాలంలో జగన్ ప్రత్యేకించి పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి భారతి ఏదో ఒక రూపంలో వార్తల్లో నిలుస్తున్నారు. నేషనల్ మీడియా వేదికగా జగన్ పాదయాత్ర గురించి మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో పార్టీ వింగ్‌ను యాక్టివ్ కూడా చేస్తున్నారు. 
 
పార్టీకి సంబంధించిన విషయాలను హైలెట్ చేస్తూ కీ రోల్ పోషిస్తున్నారు భారతి. ఇక తాజాగా పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారని ప్రచారం జరుగుతుండటంతో వారితో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారట భారతి. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో భారతి చొరవ తీసుకోవడంపై పార్టీ శ్రేణులు మాత్రం స్వాగతిస్తున్నారు. పార్టీలో భారతి చురుకైన పాత్ర పోషిస్తుండటంతో టిక్కెట్టు ఆశిస్తున్న కొంతమంది ఆశావహులు ఆమె వద్ద మాట తీసుకునేందుకు పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. పార్టీలో తమకు టిక్కెట్ కావాలన్న విషయాన్ని భారతితోనే రెకమెండేషన్ చేయించుకుంటున్నారట.
 
మరోవైపు భారతి కడప జిల్లా నుంచి ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న ఆలోచనలో కూడా ఉన్నారట. ఈ పరిణామాలపై వైసిపి నేతల్లో పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భారతిని ఉద్దేశపూర్వకంగానే జగన్ పార్టీలో ప్రమోట్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో విజయమ్మ, షర్మిళలు పూర్తిస్థాయిలో పనిచేశారు. వచ్చే ఎన్నికలకు జగన్ వద్దనున్న అస్త్రాలన్నీ అయిపోయాయనుకుంటున్న తరుణంలో భారతిని రంగంలోకి దింపడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. కాగా వైఎస్ భారతి చాలా నెమ్మదస్తురాలే కాకుండా అందరితో కలుపుగోలుగా వుంటారనే పేరుంది. కనుక భారతి వైసీపిలో మరింత చురుకుగా వుండటంతో ఈసారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ సీఎం కావడం ఖాయమని అంటున్నారు.