బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 27 జులై 2018 (18:34 IST)

ఊలు దారాలతో ఇయర్ రింగ్స్ ఎలా చేయాలో తెలుసా?

వేసుకున్న దుస్తుల అందం మరింత అందంగా కనిపించేందుకు వాటికి సరిపడే ఇయర్ రింగ్స్ వేసుకోవాలి. కాబట్టి ఊలు దారాలతో చేసే ఇయర్ రింగ్స్ చూసేందుకు చాలా అందంగా కనిపిస్తాయి. మరి ఈ ఇయర్ రింగ్స్‌ను ఎలా చేయాలో తెలుస

వేసుకున్న దుస్తుల అందం మరింత అందంగా కనిపించేందుకు వాటికి సరిపడే ఇయర్ రింగ్స్ వేసుకోవాలి. కాబట్టి ఊలు దారాలతో చేసే ఇయర్ రింగ్స్ చూసేందుకు చాలా అందంగా కనిపిస్తాయి. మరి ఈ ఇయర్ రింగ్స్‌ను ఎలా చేయాలో తెలుసుకుందాం.
 
కావలసిన పదార్థాలు:
సిల్క్ లేదా ఊలు దారాలు
గోల్డ్ కలర్ పూసలు
గోల్డ్ కలర్ తీగ
ఇయర్ రింగ్ హుక్స్
పట్టుకార
 
తయారీ విధానం:
ముందుగా 1 దారపు పోగును సమభాగాలుగా తీసుకోవాలి. తరువాత కావలసినంత పరిమాణంలో దారపు పోగులను కలిపి మధ్యకు తీసుకోవాలి. ఇప్పుడు మధ్య భాగాన్ని మరో దారంతో ముడివేయాలి. ఈ దారాన్ని తీగకు గుచ్చి గోల్డ్ కలర్ పూసను దారం ముడి వేసిన భాగంలో పెట్టి ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టి సెట్ చేయాలి. పూస అటూ ఇటూ జరుగకుండా తీగను పట్టుకారతో ముడి వేయాలి. ఇప్పుడు చెవి హుక్‌ను ముడిలా తిప్పిన తీగకు పెట్టాలి. చివరగా కింది భాగంలో సమంగా లేని దారపు పోగులను కత్తిరించాలి. అంతే ఊలు దారాలతో ఇయర్ రింగ్స్ రెడీ.