శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By సిహెచ్
Last Modified: శనివారం, 19 జనవరి 2019 (19:17 IST)

బనానా కేక్ భలే టేస్ట్... తింటారా?

అరటిపండు మధుర ఫలం... శరీరానికి అవసరమైన పీచు పదార్ధానికి మంచి వనరు కూడా... అరటిపండు తినడం వల్ల శరీరంలో ఉత్పత్తి అయ్యే మంచి బ్యాక్టీరియా జీర్ణవ్యవస్ధను శుద్ధి చేస్తుంది. అలాగే అరటిపండులో విటమిన్ బి, విటమిన్ సి, పొటాషియంలు అధికంగా ఉండి శరీరానికి మేలు చేస్తాయి. అలాంటి అరటిపండును ఉపయోగించి వండగల వంటకం బనానా పాన్ కేక్. తక్షణ శక్తిని అందించగల, ఎదిగే పిల్లల శారీరక అవసరానికి చాలా ఉపయుక్తమైన ఆహారం ఇది.
 
కావలసిన పదార్ధాలు..
అరటిపండ్లు- 2
మైదా- ఒక కప్పు
ఎగ్- 1
మిశ్రమం చేయడానికి తగినంత మజ్జిగ,
ఒక టేబుల్ స్పూన్ చక్కెర
తేనె, ప్రై కోసం నూనె లేదా వెన్న
 
తయారీ విధానం...
మైదా, కోడిగుడ్డు, చక్కెర, మజ్జిగలను కలిపి ఉంచుకోవాలి. పాన్‌ను హీట్ చేసి ఆ మిశ్రమాన్ని రెండు నిమిషాలపాటు వేయించాలి. నూనెను ఉపయోగించుకొని పాన్ కేక్‌లను తయారుచేసుకోవాలి. నాలుగు నుంచి ఆరు పాన్ కేకులను తయారుచేసుకొని ఒకదానిపై మరొకటి ఉంచుతూ వాటి మధ్యలో చిన్నస్లైస్‌లుగా కోసి ఉంచిన అరటిపండును ఉంచాలి. అలా అమర్చి ఉంచిన కేకులపైన వేయించిన మిశ్రమాన్ని పోసి సర్వ్ చేసుకోవాలి. అంతే... ఎంతో రుచికరమైన కేక్స్ రెడీ.