శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By
Last Updated : శుక్రవారం, 26 అక్టోబరు 2018 (11:57 IST)

ఆపిల్ జ్యూస్‌తో ఆపిల్ చిప్స్.. ఎలా చేయాలంటే..?

ప్రతిరోజూ ఒక ఆపిల్ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంత మంచిదో.. కానీ పిల్లలు ఆపిల్ తినడానికి అంతగా ఇష్టపడరు. అందువలన ఈ ఆపిల్స్ స్నాక్స్ ఐటెమ్స్ ఏవైనా చేసిస్తే తప్పకుండా తింటారు. మరి ఆపిల్ చిప్స్ ఎలా చేయాలో చూద్దాం..
 
కావలసిన పదార్థాలు:
ఆపిల్ జ్యూస్ - 2 కప్పులు
ఆపిల్స్ - 2
దాల్చిన చెక్క - 1
 
తయారీ విధానం:
ముందుగు ఓ గిన్నెలో ఆపిల్ జ్యూస్ పోసి అందులో దాల్చినచెక్కను వేసి కాసేపు వేడిచేసుకోవాలి. ఇప్పుడు ఆపిల్స్ చిప్స్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ఆపిల్ ముక్కలను వేడవుతున్న ఆపిల్ జ్యూస్‌లో వేయాలి. 5 నిమిషాల పాటు అలానే ఉంచి దించేయాలి. ఆ తరువాత ఆపిల్ ముక్కలను ఆ జ్యూస్‌లో నుండి తీసి కాసేపు ఆరబెట్టుకోవాలి. అవి బాగా ఆరిన తరువాత ఓవెన్‌లో పెట్టి 250 డిగ్రీల ఫారన్‌హీట్ వద్ద అరగంట పాటు బేక్ చేయాలి. అంతే టేస్టీ టేస్టీ ఆపిల్ చిప్స్.. స్నాక్స్ రెడీ.