టేస్టీ టేస్టీ క్యారెట్ పాయసం ఎలా చేయాలో చూద్దాం...
క్యారెట్స్‌లోని విటమిన్స్, ఫైబర్ ఆరోగ్యానికి చాలా మంచివి. కొందరు క్యారెట్స్‌తో కూరలు, హల్వాలు, వేపుడు వంటి రకరకాల వంటకాలు తయారుచేస్తుంటారు. ఇకొందరైతే క్యారెట్‌ను పచ్చిగా తీసుకుంటారు. మరి దీనితో టేస్టీ క్యారెట్స్ పాయసం ఎలా చేయాలో చూద్దాం...
కావలసిన పదార్థాలు:
క్యారెట్స్ - 2
పాలు - అరలీటరు
నెయ్యి - 1 స్పూన్
చక్కెర - 4 స్పూన్స్
జీడిపప్పు - 6
బాదం పప్పు - 6
యాలకుల పొడి - కొద్దిగా
కుంకుమ పువ్వు - కొద్దిగా.
తయారీ విధానం:
ముందుగా జీడిపప్పు, బాదం పప్పులను అరగంట పాటు నీటిలో నానబెట్టుకోవాలి. ఆ తరువాత బాదం పప్పులను పొట్టుతీసి మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్స్ తొక్కలను తీసి సన్నగా తురిమి పెట్టుకోవాలి. తరువాత కుంకుమ పువ్వును పాలలో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నెయ్యి వేసి వేడయ్యాక క్యారెట్ తురుము వేసి బాగా వేయించుకోవాలి.
మరో బాణలిలో పాలు పోసి సన్నని మంటపై ఉంచి మరిగించాలి. పాలు కాస్త చిక్కబడిన తరువాత క్యారెట్ తురుము, జీడిపప్పు పేస్ట్ వేసి బాగా కలిపి మరికాసేపు అలానే ఉంచుకుని ఆ తరువాత చక్కెర, యాలకుల పొడి వేసి కలుపుకుని చివరగా కుంకుమ పువ్వు వేసి కలిపి 2 నిమిషాల తరువాత దించేయాలి. అంతే టేస్టీ అండ్ హెల్తీ క్యారెట్ పాయసం రెడీ.