బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By
Last Updated : బుధవారం, 24 అక్టోబరు 2018 (11:47 IST)

కరివేపాకు పొడి తయారీ విధానం...

కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలోని పోషక విలువలు వ్యాధి నిరోధకశక్తిని పెంచుటకు సహాయపడుతాయి. కరివేపాకు ప్రతిరోజూ తీసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. కానీ, కరివేపాకును పచ్చిగా తీసుకోవడానికి చాలామంది ఇష్టపడరు. అందుకు కరివేపాకు పొడి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మరి ఈ పొడిని ఎలా చేయాలో చూద్దాం..
 
కావలసిన పదార్థాలు:
కరివేపాకు - 1 కప్పు
మినపప్పు - 100 గ్రాములు
ధనియాలు - 50 గ్రాములు
జీలకర్ర - 10 గ్రాములు
ఎండుమిర్చి - 50 గ్రాములు
ఉప్పు - తగినంత
నూనె - సరిపడా
మెంతులు - కొద్దిగా
పసుపు - 1 స్పూన్
 
తయారీ విధానం:
ముందుగా బాణలిలో నూనెన వేడి చేసుకుని కరివేపాకు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మెంతులు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత అందులో కొద్దిగా ఉప్పు, పసుపు కలిపి పొడి చేసుకోవాలి. అంతే కరివేపాకు పొడి రెడీ.