ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్
Written By Kowsalya
Last Updated : సోమవారం, 23 జులై 2018 (14:08 IST)

నిమ్మరసం సూప్ తయారీ విధానం.....

విటమిన్ 'సి' పుష్కలంగా ఉండే నిమ్మకాయలో కొవ్వును కరిగించే లక్షణాలు ఉన్నాయి. ఐరన్‌ లోపంతో బాధపడేవారు తొందరగా నీరసించే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు ఎక్కువ క్యాలరీలు ఉన్న స్నాక్స్ తీసుకునే బదులు లెమన్ జూస్‌తో

విటమిన్ 'సి' పుష్కలంగా ఉండే నిమ్మకాయలో కొవ్వును కరిగించే లక్షణాలు ఉన్నాయి. ఐరన్‌ లోపంతో బాధపడేవారు తొందరగా నీరసించే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు ఎక్కువ క్యాలరీలు ఉన్న స్నాక్స్ తీసుకునే బదులు లెమన్ జూస్‌తో కూడిన సూప్ తీసుకుంటే ఎక్కువ శక్తిని ఇవ్వడమే కాకుండా శరీరంలోని కొవ్వును కూడా కరిగిస్తుంది.
  
 
కావలసిన పదార్థాలు: 
సన్నగా తరిగిన కొత్తిమీర - 2 స్పూన్స్ 
ఉల్లిపాయ - 1
ఉల్లికాడలు - 1 
అల్లం - అంగుళం ముక్క 
వెల్లుల్లిపాయ - 1
నిమ్మరసం - 2 స్పూన్ 
వెజిటబుల్‌ స్టాక్‌ - 4 కప్పులు 
మిరియాల పొడి - కొంచెం
ఉప్పు - రుచికి సరిపడా
వెన్న - 1 స్పూన్
 
తయారీ విధానం: 
ముందుగా ఉల్లిపాయ, ఉల్లికాడ, అల్లం, వెల్లుల్లి రెబ్బలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో వెన్నను వేసి కరిగిన తరువాత అందులో ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, ఉల్లికాడ ముక్కలు అన్నింటినీ వేసి వేయించుకోవాలి. ముక్కలన్నీ మెత్తగా అయ్యేంతవరకు వేయించి ఆ మిశ్రమంలో వెజిటబుల్‌ స్టాక్‌ (కూరగాయ ముక్కలు ఉడికించుకున్న నీళ్లను పోసి బాగా ఉడికించాలి. ఆ తరువాత కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి వేసి కలుకోవాలి. సూప్‌ చిక్కగా మారే సమయంలో స్టవ్‌ ఆఫ్‌ చేసేయాలి. బట్టర్‌తో గార్నిష్‌ చేసుకుని వేడివేడిగా సర్వ్‌ చేసుకుంటే నిమ్మరసం సూప్ రెడీ.