శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : శనివారం, 21 జులై 2018 (13:47 IST)

మెడభాగం నల్లగా ఉందా? ఈ చిట్కాలు పాటిస్తే?

ముఖం మీద ఉన్న శ్రద్ధ మెడపై చాలామంది చూపించరు. కాని మెడ చుట్టూ పేరుకున్న ట్యాన్ చూడడానికి అసహ్యంగా కనిపిస్తుంది. అందుకోసమైనా మెడపై శ్రద్ధ వహించడం మంచిది. ట్యాన్‌ని ఎలా తొలగించాలో తెలుసుకుందాం.

ముఖం మీద ఉన్న శ్రద్ధ మెడపై చాలామంది చూపించరు. కాని మెడ చుట్టూ పేరుకున్న ట్యాన్ చూడడానికి అసహ్యంగా కనిపిస్తుంది. అందుకోసమైనా మెడపై శ్రద్ధ వహించడం మంచిది. ట్యాన్‌ని ఎలా తొలగించాలో తెలుసుకుందాం.
 
శెనగపిండిలో కొద్దిగా తేనె, నిమ్మరసం, పసుపు కలుపుకుని బాగా పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మెడకు రాసుకుని 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నిటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చును. చందనంలో పచ్చిపాలను కలుపుకుని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మెడకు రాసుకోవాలి.
 
15 నిమిషాల తరువాత చల్లని నీటితో కడుక్కుంటే నల్లని మెడ కాస్త తెల్లగా మారుతుంది. పెరుగులో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని మెడకు రాసుకుంటే మెరుగైన, కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చును. పొప్పడి పండు మెత్తగా గ్రైండ్ చేసుకుని అందులో కాస్త నిమ్మరసం కలుపుకుని మెడకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన మెడ తెల్లగాను, మృదువుగాను మారుతుంది.