మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 12 జులై 2019 (16:36 IST)

అన్నింటికీ 'ఆధార్' లేదంటే పాన్‌ డీయాక్టివేషన్!

పాన్‌-ఆధార్‌ అనుసంధాన ప్రక్రియ మాత్రం యథావిధిగా కొనసాగనుంది. అలా ఆగస్టు 31 లోపల అనుసంధానం చేయకుంటే పాన్‌ను చెల్లనిదిగా గుర్తిస్తారని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఆదాయం పన్ను రిటర్నుల (ఐటీఆర్) ఫైలింగ్‌కు ఇకపై పాన్‌కు బదులు ఆధార్‌ను ఉపయోగించొచ్చని ఇటీవల బడ్జెట్‌ ప్రతిపాదనలను పార్లమెంట్‌కు సమర్పించిన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. 
 
ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ కోసం పాన్ కార్డు లేదా ఆధార్.. ఈ రెండింటిలో దేన్నైనా ఉపయోగించొచ్చని నిర్మలా సీతారామన్ సూచించారు. ఆదాయం పన్ను ఫైలింగ్‌కు ఆధార్‌ను ఉపయోగించినప్పుడు సంబంధిత కార్డు పాన్‌ కార్డుతో అనుసంధానం కానట్లు తేలితే ఇకపై కొత్త వర్చువల్‌ పాన్‌ నంబర్‌ కేటాయిస్తారు. ఇకపై అదే పాన్‌ నంబర్‌ కానున్నది. 
పాన్‌ కార్డు లేనివారికీ ఒక విధంగా ఉపయోకరం. అదే వారికి పాన్‌ నంబర్‌ కానుంది. 
 
అయితే, ఆధార్‌తో పాన్‌ కార్డు అనుసంధానం కాని వాటిని తొలుత తాత్కాలికంగా నిలుపుదల చేస్తామని, ఒకసారి అనుసంధానం చేశాక వాటిని పునరుద్ధరించుకోవచ్చని ఓ అధికారి తెలిపారు. అలా చేయని పక్షంలో శాశ్వతంగా తొలగిస్తామని పేర్కొన్నారు. 
 
ప్రస్తుతం దేశంలో 40 కోట్ల పాన్‌ కార్డులు ఉండగా.. 22 కోట్లు మాత్రమే ఆధార్‌తో అనుసంధానం చేసి ఉన్నాయి. మిగిలిన 18 కోట్ల పాన్‌ కార్డులు లింక్‌ చేయాల్సి ఉంది. ఈ రెండింటి అనుసంధానం కేంద్రం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఆధార్‌తో అనుసంధానం చేయకుంటే అవి నకిలీగా ప్రభుత్వం భావిస్తోంది. అందుకే వీటి అనుసంధానం తప్పనిసరి చేసింది.
 
అయితే పాన్ కార్డు, ఆధార్ అనుసంధానం వ్యక్తిగత ప్రైవసీ ఉల్లంఘన కిందకు వస్తుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. దీనిపై సుప్రీంకోర్టు కూడా ఆధార్, పాన్ కార్డు అనుసంధానం చేయాల్సిందేనని తీర్పు చెప్పింది. ప్రాథమిక సేవల్లో ఆధార్ అవసరం లేదని పేర్కొంది. 
 
తాజాగా ఆధార్ సవరణ బిల్లు -2019కి పార్లమెంట్ ఆమోదించడంతో బ్యాంకులు, ప్రైవేట్ సంస్థలు, టెలికం ప్రొవైడర్లకు ఆధార్ అనుసంధానం తప్పనిస కానున్నది. పాన్ కార్డు లేకుంటే ఆధార్ కార్డుతోనే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయొచ్చు. లేని వారికి ఐటీ శాఖ వర్చువల్ పాన్ కార్డు జారీ చేస్తుంది.