గురువారం, 14 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 19 ఫిబ్రవరి 2022 (20:25 IST)

100 భారతదేశపు గ్రామాల్లో కిసాన్ డ్రోన్ యాత్రని జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని

గౌరవనీయ ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఫిబ్రవరి 18న 2 ప్రదేశాలలో ఒకేసారి మేక్ ఇన్ ఇండియా డ్రోన్ స్టార్టప్ గరుడా ఏరోస్పేస్ సదుపాయాల్ని వర్ట్యువల్‌గా ఆరంభించారు. ఈ విలక్షణమైన, నవీన కార్యక్రమంలో గౌరవనీయ ప్రధానమంత్రి తమ కమేండ్ కేంద్రం నుండి ద్రోణ బటన్‌ని నొక్కిన వెంటనే 100 కిసాన్ డ్రోన్స్ ఒకేసారి 100 గ్రామాల్లో పైకి ఎగిరాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ప్రగతిశీల భారతదేశం యొక్క 75 సంవత్సరాల సంబరాలు చేయడానికి 16 వేర్వేరు రాష్ట్రాలలో వ్యవసాయ పిచికారీ కార్యకలాపాలు ఆరంభించడానికి ఈ ప్రారంభోత్సవం చేసారు.

 
గురుగ్రామ్‌లో గరుడా యొక్క 1,10,000 చదరపు అడుగుల తయారీ సదుపాయం డెఫ్‌సిస్ సొల్యూషన్స్‌తో వ్యూహాత్మకమైన భాగస్వామం క్రింద ఆధునిక డిజైన్ మరియు ఒకే రకమైన పరీక్షా సామర్థ్యాలతో ఏర్పాటు చేయబడింది. 2.5 ఎకరాల సదుపాయం డ్రోన్ సాఫ్ట్వేర్ డిజైన్, హార్ట్వేర్ నిర్మాణపరమైన పరీక్ష, టైప్ సర్టిఫికేషన్ మరియు ప్రతిరోజూ 40 డ్రోన్స్ తయారీ సామర్థ్యాలకు వేదికగా నిలిచింది. ఎంఓడీ నుండి సంపాదించిన 33 యాంటీ డ్రోన్ సిస్టంస్ ఈ సదుపాయంలోనే తయారయ్యారని గమనించవచ్చు.

 
గరుడా వారి ప్రతిపాదిత చెన్నై ప్లాంట్ 20 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటవుతుంది. ఇక్కడ ప్రతి రోజూ భారీ పరిమాణంలో 100 డ్రోన్స్ తయారవుతాయి. రాబోయే 2 ఏళ్లల్లో 1,00,000 కిసాన్ డ్రోన్స్‌ని ఇక్కడ తయారు చేయడానికి ప్రణాళిక చేయడమైంది. ఈ ప్రదేశం ప్రతిపాదిత ఆర్ పీటీఓ (రిమోట్ పైలట్ ట్రైనింగ్) సదుపాయంగా నమోదైంది. ఇది డ్రోన్ పైలట్స్ లక్ష్యం కలిగిన వారికి శిక్షణనిచ్చే ధ్యేయాన్ని కలిగి ఉంది. 100 మందికి పైగా విద్యార్థులు, ఔత్సాహిక డ్రోన్ పైలట్స్‌ని అగ్ని కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, ఓఎంఆర్, చెన్నైలో జరిగే కార్యక్రమానికి గౌరవనీయ ప్రధాన మంత్రి ఆహ్వానించారు.

 
గత 2 సంవత్సరాలుగా స్టార్టప్ సాధించిన వృద్ధిపై గౌరవనీయ ప్రధాన మంత్రి గరుడా ఏరోస్పేస్‌ని శ్లాఘించారు. సమీప భవిష్యత్తులో ఉన్నత శిఖరాల్ని అధిరోహిస్తుందని ఆయన విశ్వసిస్తున్న డ్రోన్ రంగానికి రావలసిందిగా ఎంతోమంది యువతని ఆయన ప్రోత్సహించారు.

 
"2021లో డ్రోన్ నియమాల్ని సరళీకరించిన ప్రభుత్వం డ్రోన్ శక్తిపై ప్రధానమైన విధాన నిర్ణయాలతో ఆత్మనిర్భర్ భారత్‌ని స్థిరంగా ప్రోత్సహిస్తోంది. విదేశీ డ్రోన్స్ దిగుమతిని నిషేధించింది" అని ప్రధాన మంత్రి అన్నారు. "గరుడా ఏరోస్పేస్ రాబోయే 2 ఏళ్లల్లో 1,00,000 మేక్ ఇన్ ఇండియా డ్రోన్స్‌ని తయారు చేసి, 2.5 లక్షలు మంది నైపుణ్యమున్న యువతకి నేరుగా నియామకానికి, పరోక్షంగా ఉపాధి కల్పించాలని భావిస్తోంది. ఎందుకంటే  డ్రోన్స్ ఉపాధిని కల్పించడమే కాకుండా వ్యవసాయం, సర్వేయింగ్, నిఘా, ఇండస్ట్రీ 4.0 వంటి పలు రంగాలలో అంతరాయం కలిగిస్తుందని" అన్నారు.

 
"డ్రోన్స్‌ని ఉపయోగించి అత్యంత కొత్త వర్ట్యువల్ ప్రయోగం నిర్వహించడం నా జీవితంలో అతి గొప్ప గౌరవం కాగా భారతదేశానికి ఆదర్శప్రాయులు, నా హీరో మోదీ గారి సమక్షంలో ప్రయోగం జరగడం అది నాకు మరింత ప్రత్యేకం' అని గరుడా ఏరోస్పేస్ స్థాపకులు, సీఈఓ అగ్నీశ్వర్ జయప్రకాష్ అన్నారు. 'ప్రధాన మంత్రి మా డ్రోన్ సదుపాయాల్ని ప్రారంభించడం భారతదేశంలోనే 1వ డ్రోన్ యూనికార్న్ స్టార్టప్‌గా అవ్వాలని కోరుకునే గరుడా కలని ప్రోత్సహిస్తుంది, ఇది 6 లక్షలు డ్రోన్స్‌ని తయారుచేస్తుంది. 2025 నాటికి భారతదేశంలోని ప్రతి గ్రామంలో 1 డ్రోన్ ఏర్పాటు చేస్తుంది'  అని  పేర్కొంటూ ఆయన తన ప్రసంగం ముగించారు.