మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఫ్లాష్ బ్యాక్ 2020
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 డిశెంబరు 2020 (22:12 IST)

#FlashBack2020 : విరాట్ కోహ్లీకి కలిసిరాని 2020... ఎందుకో తెలుసా?

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి 2020 సంవత్సరం ఏమాత్రం కలిసిరాలేదని చెప్పొచ్చు. గత 2008 సంవత్సరంలో కోహ్లీ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించాడు. అప్పటి నుంచి అంటే 2018 నుంచి 2019 వరకు ప్రతి యేడాది ఏదో ఒక ఫార్మెట్‌లో సెంచరీ చేస్తూ వచ్చాడు. కానీ, 2020లో మాత్రం కోహ్లీ ఒక్కటంటే ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. అందుకే ఈ సంవత్సరం కోహ్లీకి ఏమాత్రం కలిసిరాలేదని చెప్పొచ్చు.
 
ఈ యేడాది ఇప్పటివరకు విరాట్ కోహ్లీ 6 టెస్ట్ ఇన్నింగ్స్‌లతో పాటు.. 9 వన్డే మ్యాచ్‌లు, 9 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. అంటే కోహ్లీ అన్ని  ఫార్మెట్లలో కలిపి మొత్తం 24 ఇన్నింగ్స్ అడాడు. ఈ ఇన్నింగ్స్‌లలో కేవలం ఆరు అర్థ సెంచరీలు మాత్రమే ఉండటం గమనార్హం. ఒక్కటంటే ఒక్క అర్థ సెంచరీ కూడా లేకపోవడం గమనార్హం. 
 
న్యూజీలాండ్ పర్యటనలో ఆడిన టెస్టుల్లో కోహ్లీ చేసిన అత్యధిక స్కోర్ కేవలం 38 పరుగులు మాత్రమే కావడం గమనార్హం. ఆ తర్వాత ఆడింది అడిలైడ్ టెస్టులోనే. ఆస్ట్రేలియా జట్టుతో. ఈ టెస్టులోనూ కోహ్లీ విఫలమయ్యాడు. ఫలితంగా భారత జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో పట్టుపని 40 పరుగులు చేయలేక చతికిలపడింది.
 
కానీ, బీసీసీఐకు కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ టోర్నీలో మాత్రం కోహ్లీ అద్భుతంగా రాణించాడు. ప్లేఆఫ్స్‌కు చేరుకునే ఆర్సీబీ జట్టు ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్ చేతిలో ఓటమిపాలై వెనుదిరిగింది. మొత్తానికి కెప్టెన్ విరాట్ కోహ్లీకి 2020 కెరీర్ పరంగా అసలు కలసిరాలేదనే చెప్పాలి. 
 
ఇకపోతే, 2008లో 5 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ ఒక్క సెంచరీ కూడా చేయలేదు. కానీ, 2009లో అన్ని ఫార్మెట్లలో కలిపి 10 ఇన్నింగ్స్‌లు ఆడగా 3 సెంచరీలు బాదాడు. అలాగే, 2010లో 3 (27 ఇన్నింగ్స్), 2011లో 4 (43 ఇన్నింగ్స్), 2012లో 8 (40 ఇన్నింగ్స్), 2013లో 6 (43 ఇన్నింగ్స్), 2014లో 8 (38 ఇన్నింగ్స్), 2015లో 4 (31 ఇన్నింగ్స్), 2016లో 7 (37 ఇన్నింగ్స్), 2017 11 (46 ఇన్నింగ్స్), 2018లో 11 (37 ఇన్నింగ్స్), 2019లో 7 (44 ఇన్నింగ్స్), 2020లో 21 ఇన్నింగ్స్‌లు ఆడి ఒక్కటంటే ఒక్క ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ చేయలేకపోయాడు.