సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By Kowsalya
Last Updated : గురువారం, 4 అక్టోబరు 2018 (12:18 IST)

తుమ్ములు ఎందుకు వస్తాయో.. తెలుసా..?

కొందరికి జలుబు వలన తుమ్ములు వస్తుంటాయి. మరికొందరికి బయటి పదార్థాలు ముక్కు రంధ్రాలలోనికి వెళ్లినపుడు ముక్కు జిలపెడుతుంది.

కొందరికి జలుబు వలన తుమ్ములు వస్తుంటాయి. మరికొందరికి బయటి పదార్థాలు ముక్కు రంధ్రాలలోనికి వెళ్లినపుడు ముక్కు జిలపెడుతుంది. తుమ్ము వచ్చినప్పుడు కడుపు, రొమ్ము, డయాఫ్రమ్, స్వరపేటిక, గొంతు వెనుకభాగం, కళ్ళు ఇవన్నీ పనిచేస్తాయి. ఇవన్నీ కలిసి బయటి నుండి శరీరం లోనికి వెళ్లిన పదార్థాలను తుమ్ము ద్వారా బయటకు పంపుతాయి.
 
తుమ్ములు ఆగకుండా ఎందుక వస్తాయంటే వ్యర్థ పదార్థాలను బయటకు రానంతవరకు వస్తునే ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జలుబు వలన తుమ్ములు వస్తుంటాయి. ఎందుకంటే అప్పుడు ముక్కులోని రంధ్రాలలో వాపు ఏర్పడుతుంది. దీనివలన ఇరిటేషన్ మొదలై దాంతో తుమ్ములు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.