గురువారం, 31 అక్టోబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 2 జూన్ 2023 (16:33 IST)

సతమతం చేసే ముక్కుదిబ్బడ, వదిలించుకునే మార్గాలు ఇవే

cold
ముక్కు దిబ్బడ. ఈ సమస్యతో చాలామంది సతమతమవుతుంటారు. మరీ ముఖ్యంగా రాత్రివేళ ఈ ముక్కు దిబ్బడ మరీ ఇబ్బంది పెడుతుంది. దీనితో నిద్ర కూడా సరిగా పట్టకుండా చాలా ఇబ్బంది పెడుతుంది. దీన్ని వదిలించుకునేందుకు ఆచరించాల్సిన చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము. తీవ్రమైన జలుబు లేదా ముక్కు పూర్తిగా మూసుకుపోయి దిబ్బడగా అనిపిస్తే వేడి నీటి ఆవిరిని పీల్చాలి. ముక్కు దిబ్బడ వేధిస్తున్నప్పుడు గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కుంటే సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.
 
ముక్కు దిబ్బడ వదిలించుకోవాలంటే స్పైసీ ఫుడ్ కూడా మంచి మార్గం. అలాంటి ఆహారంతో ముక్కుదిబ్బడ తగ్గుతుంది. ముక్కు మూసుకుపోయి దిబ్బడగా వుంటే నాసల్ స్ప్రేలను తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తారు. మంచినీరు, ఇతర ద్రవ పదార్థాలను అధికంగా తీసుకుంటే నాసికా భాగాలలో శ్లేష్మం సన్నబడి సైనస్‌లో ఒత్తిడి తగ్గి చికాకు తగ్గుతుంది.
 
ముక్కుదిబ్బడ మరీ ఇబ్బంది పెడుతుంటే వైద్యుడి సిఫార్సు మేరకు మందులు తీసుకుంటే సమస్య నుంచి బయటపడవచ్చు. రాత్రి వేళ మంచి నిద్ర శరీర సమస్యలను బైటపడవేయగలదు, ఈ నిద్ర కణజాల పెరుగుదలను ప్రోత్సహించే హార్మోన్లను విడుదల చేస్తుంది.