బుధవారం, 8 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By chj
Last Modified: బుధవారం, 19 ఏప్రియల్ 2017 (21:16 IST)

వేసవిలో ఎలాంటి పదార్థాలను తినకూడదో తెలుసా?

వేసవిలో కొన్ని పదార్థాలను తినకూడదు. ఐనా కొన్ని పదార్థాలను చూస్తే నోరు ఊరుతుంది. తినాలని అనిపిస్తుంది. ఐతే వాటికి దూరంగా వుండక తప్పదు. ఎండలు పెరిగుతున్నప్పుడు ఇలాంటివి తీసుకుంటే ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. ముఖ్యంగా మసాలాలు, కారం మోతాదుకు మించి వున్

వేసవిలో కొన్ని పదార్థాలను తినకూడదు. ఐనా కొన్ని పదార్థాలను చూస్తే నోరు ఊరుతుంది. తినాలని అనిపిస్తుంది. ఐతే వాటికి దూరంగా వుండక తప్పదు. ఎండలు పెరిగుతున్నప్పుడు ఇలాంటివి తీసుకుంటే ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. ముఖ్యంగా మసాలాలు, కారం మోతాదుకు మించి వున్నవాటిని తీసుకోవడం తగ్గించాలి. 
 
మాంసాహారాన్ని తీసుకునేవారు తగ్గించడం మంచిది. చికెన్, మటన్ వేసవిలో తీసుకుంటే జీర్ణ సంబంధమైన సమస్యలను తెచ్చిపెడతాయి. విరేచనాలు, మలబద్ధకానికి కారణమవుతాయి. అలాగే నూనెలో బాగా వేయించిన కూరలు తీసుకోకూడదు. ఫ్రైడ్ రైస్, ఫ్రైడ్ చిప్స్, ఆలూ చిప్స్ వంటి వాటికి దూరంగా వుండాలి. ఇలాంటివి తింటే కడుపులో అజీర్ణం చేయడమే కాకుండా కొన్నిసార్లు వాంతులు కూడా అవుతాయి. కడుపంతా నొప్పితో మెలిపెట్టినట్లు అవుతుంది. కనుక ఇలాంటి వాటికి కాస్త దూరంగా వుండటమే మంచిది.