బరువు తగ్గాలనుకుంటే.. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్యే ఆహారం తీసుకోండి..
బరువు తగ్గాలనుకుంటే.. రాత్రిపూట భోజనం చాలా త్వరగా తీసుకోవాలని, లేదంటే అసలు మానేయడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య ఆహారం తీసుకోవడం మంచిది. ఉ
బరువు తగ్గాలనుకుంటే.. రాత్రిపూట భోజనం చాలా త్వరగా తీసుకోవాలని, లేదంటే అసలు మానేయడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య ఆహారం తీసుకోవడం మంచిది. ఉదయంపూట మహారాజులా, రాత్రి పూట బిచ్చగాడిగా భోజనం చేయమంటారు. పెద్దలు. దీనికి అర్థం.. ఉదయం పూట పుష్టిగా, రాత్రిపూట చాలా తక్కువ తీసుకోవాలన్నదే. ఇలా చేస్తే.. శరీరంలో ఉన్న అధికమైన కొవ్వును కరిగిపోతుంది.
బరువు తగ్గాలనుకునే కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా శీతాకాలం తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. బర్గర్లు, పిజ్జాలు వంటి హై కెలోరీ ఆహారాల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. రోజుకు ఆరు నుంచి 8 గ్లాసుల నీరు సేవించండి. చలికాలంలో నీటి దాహం వేయకపోయినా అప్పుడప్పుడు నీటిని తీసుకోవాలి. అప్పుడే శరీరంలోని వ్యర్థాలు తొలగిపోయి.. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.