శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 21 అక్టోబరు 2017 (09:59 IST)

వర్షాకాలం, చలికాలంలో స్వీట్లు వద్దే వద్దు.. నాన్ వెజ్ తగ్గించండి..

వర్షాకాలంలో, చలికాలంలో అజీర్ణానికి దారితీసే ఆహారాన్ని పక్కన బెట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం నడుస్తోంది. కొద్దిరోజుల్లోనే చలికాలం రాబోతున్నది. ఈ సీజన్లలో ఏవి పడితే అవి తిన

వర్షాకాలంలో, చలికాలంలో అజీర్ణానికి దారితీసే ఆహారాన్ని పక్కన బెట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం నడుస్తోంది. కొద్దిరోజుల్లోనే చలికాలం రాబోతున్నది. ఈ సీజన్లలో ఏవి పడితే అవి తినకూడదు. అలా చేస్తే అనారోగ్య సమస్యలు తెచ్చుకున్నట్లే. ముఖ్యంగా చలికాలంలో ఎక్కువగా స్వీట్లు తినకూడదు. ఇవి రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయి. తద్వారా గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్ వస్తాయి. జీర్ణ వ్యవస్థ పనితీరు సరిగ్గా ఉండదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
అలాగే పాలు, పాల ఉత్పత్తులు జీర్ణం అయ్యేందుకు చాలా సమయం పడుతుంది. రాత్రిపూట పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోవడం తగ్గించాలి. లేకుంటే అనారోగ్యం దాపురిస్తుంది. ఈ సీజన్లో మాంసాహారాన్ని తగ్గించాలి. నాన్‌వెజ్ తింటే జీర్ణసంబంధిత వ్యాధులు వస్తాయి. డయేరియా ఇబ్బంది పెడుతుంది. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు సోకుతాయి. అందుకే మాంసాహారాన్ని మితంగా తీసుకోవడం.. అదీ పగటిపూట తీసుకోవడం మంచిది. 
 
వీటితో పాటు జంక్ ఫుడ్, ఫ్రై చేసిన పదార్థాలు చాలా ఇబ్బంది పెడుతాయి. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వస్తాయి. ఒక్కోసారి ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంది. అందుచేత సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఈ సీజన్లలో తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు.