1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (15:01 IST)

పేపర్ కప్‌ల్లో టీ, కాఫీలు తాగుతున్నారా?

పేపర్ ప్లేటులు, కప్‌లు ఉపయోగిస్తున్నారా.. అయితే జాగ్రత్త అవసరమంటున్నారు వైద్యులు. ఇవి రకరకాల రోగాలకు కారణమవుతున్నాయి. ప్రాణాంతకమైన క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం వుందట. ఈ ప్లాస్టిక్ కణాలు కడుపులో చేరడం ద్వారా హార్మోన్ల అసమతుల్యత, దృష్టిలోపాలు, అలసట, చర్మ సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
కప్పుల్లో వుంటే బ్యాక్టీరియా కోసం పొట్టలో చేరి లేని పోని సమస్యలు తీసుకువస్తుందని వారు చెప్తున్నారు. ఇంకా కప్పులకు పూసే వాక్స్ ద్వారా వేడి వేడి ఛాయ్ అందులో పోయడంతో ఆ వాక్స్ కరిగి కడుపులోకి చేరుతుంది. 
 
ఇది చిన్న పేగుల్లో ఇన్ఫెక్షన్లకు తీసుకువస్తుంది. జీర్ణప్రక్రియ వ్యవస్థను దెబ్బతీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే థర్మాకోల్ కప్పులు కూడా వాడకూడదని.. అవి పాలియస్టర్ అనే పదార్థంతో తయారు చేస్తున్నారని..ఇది ఒక రకమైన ప్లాస్టిక్ అంటూ వైద్యులు హెచ్చరిస్తున్నారు.