మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 15 డిశెంబరు 2022 (22:56 IST)

గుప్పెడు బాదములతో ఆలోచనాత్మకంగా ఈ క్రిస్మస్‌ను వేడుక చేయండి

Almonds
నిస్సందేహంగా సంవత్సరంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే వేడుకలలో ఒకటి క్రిస్మస్‌ ఒకటి. డిసెంబర్‌ నెల రావడంతో క్రిస్మస్‌ ట్రీలు, జింగిల్‌ బెల్స్‌, కారోలింగ్‌ కాయిర్స్‌, సీక్రెట్‌ శాంతాలకు కూడా సమయం ఆసన్నమైంది. ఆత్మీయ సమావేశాలు,డిన్నర్‌ పార్టీలు, హాలీడేస్‌, బహుమతులు మొదలుపెడితే ప్రతి ఒక్కరికీ ఒకటి ఈ సీజన్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ శీతాకాలపు చల్లగాలులకు, స్వెటర్‌ వాతావరణానికి మరింత ఆనందం జోడిస్తూ ఇది మరింత ఆనందం కలిగించనుంది.
 
ఎన్నో కారణాల చేత క్రిస్మస్‌ ఉత్సాహపూరితంగాఉంటుంది. అత్యంత రుచికరమైన ఆహారం కోసం ఈ సీజన్‌లో మనమంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తుంటాము. ఈ సంవత్సరం ఆహారంను ఆప్రమప్తంగా ఎంచుకోండి, ఆరోగ్యవంతమైన క్రిస్మస్‌ను ఆస్వాదించండి.
 
బాదములు, చక్కటి ఆరోగ్యానికి అద్భుతమైన బహుమతిగా నిలుస్తాయి.  వీటిని మీకు మీరు బహుమతిగా అందించుకోవచ్చు, స్నేహితులు, కుటుంబసభ్యులకు కూడా బహుమతిగా అందజేయవచ్చు. అత్యవసర పోషకాలైనటువంటి విటమిన్‌ ఇ, ప్రోటీన్‌, ఐరన్‌, రిబోఫ్లావిన్‌, మాంగనీస్‌, ఫోలేట్‌ వంటి అత్యవసర పోషకాలు సైతం వీటిలో ఉంటాయి. బాదములు అత్యధిక పోషకాలు కలిగి ఉండటంతో పాటుగా ఆరోగ్యవంతమైన స్నాక్‌గా నిలుస్తాయి.  పోషకాహార ప్రయోజనాలు కాకుండా  బాదములు నట్స్‌గా ఎలాంటి ఫుడ్‌ ఐటెమ్స్‌లో అయినా సులువుగా మిళితమవుతాయి. మీ కుకింగ్‌ శైలిని మరింత తాజాగా మలుచుకునే అవకాశం క్రిస్మస్‌ మీకు  అందిస్తుంది. పూర్తి సరికొత్త రుచికరమైన, ఆరోగ్యవంతమైన రెసిపీలను ప్రయత్నించండి.
 
ఫిట్‌నెస్‌, సెలబ్రిటీ ఇన్‌స్ట్రక్చర్‌, యాస్మిన్‌ కరాచీవాలా మాట్లాడుతూ ‘‘సాధారణంగా పండుగలంటే సంతోషపు వేడుకలు, పార్టీలకు సమయంగా ఉంటుంది. మనలో చాలామంది తమ డైట్‌ మరియు ఫిట్‌నెస్‌ షెడ్యూల్స్‌ను మరిచిపోయే కాలం కూడా అది. ఈ సమస్యను అతి సులభంగా అధిగమించేందుకు ఆరోగ్యవంతమైన స్నాక్స్‌ అయినటువంటి రోస్టెడ్‌ లేదా ఫ్లేవర్డ్‌ ఆల్మండ్స్‌, తాజా పళ్లు లేదా ఓట్‌మీల్‌ను తీసుకోండి. ఎలాంటి  ఖాళీ కేలరీలను జోడించకుండా మీ ఆకలిని ఇవి జోడించగలవు’’ అని అన్నారు.
 
న్యూట్రిషన్‌ అండ్‌ వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ ‘‘క్రిస్మస్‌  సమయంలో,  స్నేహితులు, కుటుంబసభ్యులతో గడిపే ప్రతి క్షణమూ మనల్ని ఘనమైన, కేలరీలు అధికంగా కలిగిన ఆహారం తీసుకునేలా ప్రోత్సహిస్తుంది. అది మన ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ప్రభావం చూపుతుంది. బాదములు లాంటి ప్రత్యామ్నాయాలు  ఈ సమయంలో మనకందరికీ కావాలి. పరిశోధనలు వెల్లడించే  దాని ప్రకారం బాదములు లాంటి  గింజలు కేవలం చక్కదనం అందించడం మాత్రమే కాదు ప్రతి బైట్‌లోనూ చక్కదనం అందిస్తుంది. అదే సమయంలో గుండె ఆరోగ్యం, బరువు  నిర్వహించడంలోనూ తోడ్పడుతుంది’’ అని అన్నారు.
 
సుప్రసిద్ధ భారతీయ చిత్ర, టెలివిజన్‌ నటి నిషా గణేష్‌ మాట్లాడుతూ ‘‘ప్రపంచవ్యాప్తంగా  క్రిస్మస్‌ వేడుకలను నిర్వహిస్తుంటారు. ఈ వేడుకల్లో ప్రతి ఒక్కరూ తమ స్నేహితులను, ఆప్తులను కలుసుకుంటుంటారు. ఈ సమయంలో  బహుమతులు పంచుకోవడం, చక్కటి ఆహారం తీసుకోవడంలో లీనమవుతుంటారు. అయితే, మన ఆరోగ్యం , జీవనశైలి పరిగణలోకి  తీసుకున్నప్పుడు క్రిస్మస్‌ గిఫ్ట్‌ హ్యాంపర్లలో బాదములను జోడించడం మంచి అంశం. చక్కటి ఆరోగ్యానికి  మెరుగైన  బహుమతి బాదములు.  వీటిలో విటమిన్‌ ఈ, ప్రోటీన్‌ మొదలైనవి ఉంటాయి. అవి మన ఆరోగ్యానికి  మంచిది’’ అని అన్నారు.