సోమవారం, 27 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 8 మే 2020 (17:07 IST)

కరోనా వైరస్: మామిడి పండు తోలు తీసి తింటే ఎంత ప్రయోజనమో తెలుసా?

కరోనా వైరస్ దెబ్బకు ఏ పండు తినాలన్నా భయపడుతున్నారు. ఇప్పుడు మామిడిపళ్ల సీజన్ వచ్చేసింది. ఐతే ఈ మామిడపళ్లను ప్రస్తుతం తోలు తీసుకుని తింటే మంచిదంటున్నారు. మామిడి పండు తింటే బరువు పెరుగుతారని కొందరు, లేదు తగ్గుతారని మరికొంతమంది అనుకుంటారు. కానీ తొక్కులేని మామిడి పండు తినడం వల్ల అధికబరువును తగ్గించుకోవచ్చు అంటున్నారు వైద్యులు. 
 
బరువు తగ్గాలనుకునే వారు తొక్క తీసిన మామిడి పండును తినడం ద్వారా అనుకున్న ఫలితం పొందవచ్చన్న విషయం తాజా అధ్యయనంలో వెల్లడైందట. మామిడి పండుపైనున్న తోలు తీసేసి కేవలం లోపలున్న గుజ్జు తిన్నట్లయితే యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. మామిడి పండు తోలులో కాంపౌండ్లు అధికంగా ఉంటాయనీ అందువల్ల తొక్కతో పండును తీసుకోవడం మంచిది కాదంటున్నారు.
 
అదే తోలు తీసేసిన మామిడితో శరీరంలో క్రొవ్వు శాతాన్ని తగ్గించే ప్రొటీన్లు అత్యధికంగా ఉంటాయని వారు చెబుతున్నారు. అందువల్ల తోలు లేని మామిడి పండు ఊబకాయం తగ్గేందుకు ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు. ఈ విషయం మీద ఇంకా పరిధోనలు నిర్వహించాల్సి ఉందని వారు చెబుతున్నారు.