బుధవారం, 13 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 1 జులై 2021 (16:14 IST)

గుండె జబ్బులను అడ్డుకునే సీతాఫలం

ఫాస్ట్‌ఫుడ్‌, చక్కెర శాతం అధికంగా ఉండే వాటిని ఆహారంగా తినడం, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఆహారాన్ని తినకపోవడం, ఒత్తిడి, తగినంత వ్యాయామం లేకపోవడం తదితర కారణాల వల్ల గుండె ఆరోగ్యం పాడవుతుంది.
 
ఆహారంలో వెల్లుల్లి, లవంగ మొగ్గలు, జీలకర్రను తరచూ తీసుకోవడం వల్ల చెడుకొలెస్ట్రాల్‌ దరిచేరదు. అంతేకాదు అవి గుండెనాళాల్లో ఆటంకాలని తొలగిస్తాయి. వాల్‌నట్స్‌, ఎర్రని దానిమ్మ గింజలు, పాలకూర వంటివి గుండె నాళాలను శుభ్రపరిచి రక్తాన్ని సజావుగా సాగేట్టు చేస్తాయి.
 
ఆలివ్‌నూనె, ఉల్లిపాయలు హృదయం పదిలంగా ఉండేట్టు చేస్తాయి. ఓట్‌మీల్‌, తాజా పండ్లు, కాయగూరలు, బీన్స్‌, తృణధాన్యాలు, బ్రకోలీ, క్యాలీఫ్లవర్‌, గుమ్మడి గింజలు, టమాటాలు.. వీటిల్లో డైటరీ ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు.
 
టమాటాలు, దంచిన వెల్లుల్లి రేకలని చెంచా ఆలివ్‌నూనెతో మగ్గపెట్టి పేస్ట్‌లా చేసుకోవాలి. దీనిని బ్రౌన్‌బ్రెడ్‌ అంటే తృణధాన్యాలతో చేసిన బ్రెడ్‌తో కలిపి తీసుకొంటే గుండెకు మంచిది. మాంసాహార వంటకాలు, అతిగా ప్రాసెస్‌ చేసిన ఆహారం హృదయానికి చేటుచేసే పదార్థాలు.
 
టొమోటోలలో ఎన్నో రకాల పోషకాలున్నప్పటికీ.. లైకోపీన్‌కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేయటమే గాకుండా గుండెకు చేటు చేసే ఫ్రీ రాడికల్స్ ఏర్పడకుండా కూడా నిరోధిస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గతంలో ఎన్నో పరిశోధనలు పై విషయాలను నిర్ధారించినా, ఇప్పుడు తాజాగా టొమోటోల్లోని ఈ లైకోపీన్‌కు రక్తపోటును కూడా తగ్గించే గుణం ఉన్నట్లు తేటతెల్లమైంది.
 
పెరటి మొక్కల్లో శీతాఫలం శ్రేష్టమైనది. అన్ని దేశాలలోనూ విరివిగా దొరికే ఈ పండును గుండె జబ్బు ఉన్నవారు సీజన్‌ ఉన్నంత వరకు తప్పకుండా తింటుంటే.. గుండె సంబందిత సమస్యల నుండి ఉపశమనం ఉంటుంది. గుండె కొట్టుకునే తీరును సీతాఫలం క్రమబద్ధీకరిస్తుంది. రోజూ నిర్ణీత సమయం అంటే అరగంటకు తగ్గకుండా వ్యాయామం చేయడం, ధ్యానం, యోగా వంటి మీ హృదయాన్ని పదిలంగా ఉంచుతాయి.