శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 16 ఏప్రియల్ 2022 (23:16 IST)

కోడిగుడ్లు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా?

half-boiled eggs
ఆరోగ్యం విషయంలో కొన్ని చేయకూడనివి ఉన్నాయి. ఆహారంలో కొన్ని ఆహారాలు తప్పనిసరిగా చేర్చబడినప్పటికీ, వాటిని మితంగా తీసుకోవాలి. వాటిలో కోడిగుడ్లు ఉన్నాయి. కోడిగుడ్లు విషయంలో చాలామంది అనుకునే మాట ఒకటుంది. వీటిని ఎక్కువ తినడం వల్ల అధిక కొలెస్ట్రాల్ వస్తుందనేది.

 
ఐతే, అందులో ఏదైనా నిజం ఉందా? పోషకాహార నిపుణులు ఏమంటున్నారు? నిజానికి ఆహారంలో ఉండే కొలెస్ట్రాల్ సురక్షితమైనదే. కానీ కేక్ మిశ్రమాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, డీహైడ్రేటెడ్ పాలు, ప్రాసెస్ చేసిన మాంసాలలో కనిపించే కోడిగుడ్లలో ఇది ఆక్సీకరణం చెందినప్పుడు మాత్రమే హానికరం అవుతుంది. వాటిలోని కొలెస్ట్రాల్ ఆక్సీకరణం చెందుతుంది. ఇది ధమనులను అడ్డుకునే అవకాశం ఉంది అని చెపుతున్నారు.

 
సాధారణ కొలెస్ట్రాల్ కలిగి ఉంటే, చురుకైన ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి వున్నప్పుడు ప్రతిరోజూ ఒక గుడ్డును "కొలెస్ట్రాల్ కంటెంట్ గురించి ఆలోచించకుండా" తినేయవచ్చంటున్నారు. ఐతే అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు, అవతవకల జీవనశైలిని కలిగి వున్నవారు కోడిగుడ్లను పూర్తిగా వదిలేయడం మంచిది. ఒకవేళ తినాలనిపిస్తే “గుడ్డులోని తెల్లసొన మాత్రమే” తినడం మంచిది.