ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 25 జనవరి 2022 (20:02 IST)

కోడిగుడ్డు ఆమ్లెట్ లేదా ఉడికించిన గుడ్డు, ఏది ఆరోగ్యకరమైనది?

ఎగ్ ఆమ్లెట్ అనేది అందులో ఏమేమి కలిపి ఆమ్లెట్టుగా వేస్తారన్న దానిపై అది ఆరోగ్యమా, అనారోగ్యమా అనేది ఆధారపడి వుంటుంది. ఆమ్లెట్ డిష్ తయారుచేసేటప్పుడు జోడించిన పదార్థాలపై ఆధారపడి ఉంటాయి. గుడ్డు ఆమ్లెట్టులో కేవలం కూరగాయలను జోడిస్తే అది పోషకాహారాన్ని కలిగి వుంటుంది.

 
అలాంటప్పుడు అది ఉడికించిన గుడ్లు కంటే మరింత ఆరోగ్యకరమైనదిగా చేస్తుంది. దీనికి విరుద్ధంగా ఆమ్లెట్టును ఎక్కువ నూనె, వెన్న, అనారోగ్యకరమైన కొవ్వుతో కలిపితే అది రుచికరమైన ఆమ్లెట్ అవుతుంది కానీ అది శరీరానికి పెద్ద శత్రువుగా మారుతుంది.

 
కొందరు ఆమ్లెట్ తింటే బరువు తగ్గవచ్చు అనుకుంటారు. ఆరోగ్యకరమైన ఆమ్లెట్‌తో సహా ఏ ప్రత్యేకమైన ఆహారమూ బరువు తగ్గిస్తుందనే హామీ వుండదు. బరువు తగ్గాలంటే రోజువారీ కార్యకలాపాల సమయంలో క్యాలరీలు ఖర్చు చేసే దానికంటే తక్కువ కేలరీలు తినాల్సి ఉంటుంది. గుడ్లుతో సహా కొన్ని ఆహారాలు బరువు తగ్గటానికి సాయపడతాయి. ఐతే వాటిని ఎలా తీసుకుంటున్నారన్న దానిపై ఆధారపడి వుంటుంది.
 
గుడ్డును ఉడికించేటపుడు గుడ్డులోని చాలా పోషకాలు అలాగే నిక్షిప్తమై వుంటాయి. ఈ కారణంగా గుడ్లు తినడం చాలా ఆరోగ్యకరమైనది.