1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 24 జనవరి 2022 (23:36 IST)

ఎక్కువ పని గంటలు చేసేవారికి వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటో తెలుసా?

ఏదో ఎక్కువసేపు పని చేస్తున్నామనీ, కష్టపడుతున్నామని చాలామంది అనుకుంటూ వుంటాం. కానీ అలా చేయడం వల్ల ఒత్తిడి, ఖాళీ సమయం లేకపోవడం, పని-జీవిత సమతుల్యత, ఆరోగ్య ప్రమాదాలు పొంచి వున్నట్లు వైద్య నిపుణులు చెపుతున్నారు. ఎక్కువ పనిగంటలు అనేది ఉద్యోగుల పనితీరు స్థాయిలను కూడా తగ్గించవచ్చు. సుదీర్ఘ పని గంటలు అలసట, పనిపైన శ్రద్ద లోపానికి దారితీయవచ్చు.

 
దీర్ఘకాలిక పని గంటలు హృదయ సంబంధ వ్యాధులు, ఒత్తిడి, దీర్ఘకాలిక అలసట, స్ట్రోక్, ఆందోళన, నిద్రలేమి తదితర కారణాలతో మరణాలు కూడా సంభవించవచ్చు. ధూమపానం, రక్తపోటు, మానసిక ఆరోగ్య స్థితిని ప్రభావితం చేస్తాయని ఎపిడెమియోలాజికల్ పరిశోధనలో తేలింది.

 
నిద్ర లేకపోవడం, అనవసరమైన ఒత్తిడిని పెంచడం వలన అధిక రక్తపోటు, అనారోగ్యకరమైన ఆహారం, ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసే ఇతర చర్యలు వంటి ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. నిజానికి, స్టాన్‌ఫోర్డ్- హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌ల అధ్యయనంలో ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల మరణాలు దాదాపు 20 శాతం పెరుగుతాయని తేలింది.