1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 జనవరి 2022 (17:02 IST)

పాలకూరతో అధిక బరువు మటాష్

ఆకుకూరల్లో పాలకూర ప్రత్యేకమైనది. పాలకూర తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. పాలకూరలో యాంటీ ఆక్సీడెంట్స్, విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి. పాలకూరలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీని కారణంగా జీర్ణసమస్యలు దూరం అవుతాయి. 
 
శరీరానికి అవసరమైన విటమిన్ కె లభిస్తుంది. ఫ్యాట్స్, కొలెస్ట్రాల్ అసలు ఉండవు. పాలకూర  శరీరంలో వేడిని తగ్గిస్తుంది. కీళ్లనొప్పులను పోగొడుతుంది. బరువు తగ్గాలనుకున్నవారు పాలకూర తినటం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.