సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (18:52 IST)

మహమ్మారి వేళ గుప్పెడు బాదములు తీసుకోండి, యోగా చేయండి

కోవిడ్‌ 19 మహమ్మారి వేళ, ప్రపంచవ్యాప్తంగా మరీ ముఖ్యంగా భారతదేశంలో ప్రజలు నూతన సాధారణత నేపథ్యానికి అలవాటు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆల్మండ్‌ బోర్డ్‌ ఆఫ్‌ కాలిఫోర్నియా నేడు ‘మహమ్మారి వేళ పౌష్టికాహారం మరియు కుటుంబ ఆరోగ్యానికి భరోసా కల్పించాల్సిన ఆవశ్యకత’ అనే అంశంపై ఓ సదస్సును నిర్వహించింది.


ఈ చర్చా కార్యక్రమంలో దేశంలో ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకతలపై చర్చించడంతో పాటుగా తమ రోజువారీ ఆహారం, జీవనశైలిలో కుటుంబాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి సైతం చర్చించారు. ఈ సదస్సుకు నటి, వ్యాఖ్యాత షర్మిల కాసాల మోడరేట్‌ చేయగా, సెలబ్రిటీ ఫిట్‌నెస్‌ నిపుణురాలు మరియు శిక్షకురాలు కిరణ్‌ డెంబ్లాతో పాటుగా న్యూట్రిషన్‌ -వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ షీలా కృష్ణస్వామి పాల్గొన్నారు.

 
ఇప్పటికీ చాలామంది ఇంటి వద్ద నుంచి పనిచేస్తుండటం మరియు చిన్నారులు వర్ట్యువల్‌ తరగతులకు హాజరు కావడంతో అకస్మాత్తుగా కుటుంబ జీవనశైలిలో మార్పులను గమనించగలుగుతున్నాము. ఈ కారణంగానే అస్తవ్యస్తమైన, గందరగోళపు షెడ్యూల్స్‌ కనిపిస్తున్నాయి. దీనిలో మితంగా లేని భోజనం, అత్యధిక స్ర్కీన్‌ సమయం, శారీరకశ్రమ లేకపోవడం, ఆందోళన, ఒత్తిడి మరియు అతి సులభంగా లభించడం వల్ల స్నాకింగ్‌ అధికంగా తీసుకోవడం, విసుగు వంటివి కూడా భాగంగా ఉన్నాయి.

 
ఈ సదస్సు ద్వారా ఈ అంశాలన్నింటికీ తగిన పరిష్కారాలను అందించేందుకు షీలా మరియు కిరణ్‌లు ప్రయత్నించారు. వారు ఆరోగ్యానికి సంబంధించి మూడు ముఖ్యాంశాలపై దృష్టి సారించారు. అవి సరైన పౌష్టికాహారం, ఆహారపు అలవాట్లు మరియు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాల్సిన ఆవశ్యకత. వీటితో పాటుగా ఈ సంక్షోభ సమయంలో స్వీయ సంరక్షణ ఆవశ్యకతను గురించి కూడా చర్చించారు.

 
ఈ సదస్సు ద్వారా బుద్ధిపూర్వకంగా చిరుతిళ్లను తీసుకోవాల్సిన ఆవశ్యకతను గురించి అతిథులు వెల్లడించడంతో పాటుగా నగరంలోని కుటుంబాలన్నీ కూడా తమ ఆహారంలో ఆరోగ్యవంతమైన స్నాకింగ్‌ను భాగం చేసుకోవాల్సిందిగా వారు సూచించారు. అతిథులిరువురూ తమ వ్యక్తిగత జీవితాల నుంచి కొన్ని సంఘటనలను వివరించడంతో పాటుగా తమ ఆరోగ్యం, రోగ నిరోధక శక్తికి మద్దతునందించుకోవడానికి, మొత్తంమ్మీద తమ సంక్షేమం వృద్ధి చేసుకోవడానికి కుటుంబసభ్యులు  చేసుకోవాల్సిన జీవనశైలి మార్పులు మరియు ఆహార మార్పులను గురించి తగు సూచనలు సైతం చేశారు.

 
రోగ నిరోధక శక్తిని మెరుగుపరుచుకోవడం మరియు దానికి మద్దతునందించేలా పౌష్టికాహారం తీసుకోవాల్సిన ఆవశ్యకతను గురించి సెలబ్రిటీ ఫిట్‌నెస్‌ నిపుణురాలు మరియు శిక్షకురాలు కిరణ్‌ డెంబ్లా మాట్లాడుతూ, ‘‘గత సంవత్సరం వినూత్నమైనది. మనలో చాలామందికి జీవితపు విలువను తెలియజేసింది. ఓ తల్లిగా, భార్యగా నా కుటుంబ ఆరోగ్యం, భద్రతను నిర్వహించడం తగిన నివారణ చర్యలను తీసుకోవడం నా బాధ్యత అని నేను భావిస్తుంటాను. దీనికోసం, నేను బాదములపై ఆధారపడుతుంటాను.

 
ఈ బాదములలో రోగ నిరోధకశక్తికి మద్దతునందించే పోషకాలు అయినటువంటి జింక్‌ సైతం ఉంది. ఇది ఎదుగుదల, వృద్ధి మరియు రోగ నిరోధక శక్తి పనితీరు మెరుగుపరచడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. అన్ని వేళలా ఇంటిలో బాదములు ఉండేలా నేను తగు జాగ్రత్తలు తీసుకుంటుంటాను. ప్రతి రోజూ ఓ గుప్పెడు బాదములను మా కుటుంబ సభ్యులలో ప్రతి ఒక్కరూ తింటుంటారు. గత కొన్నేళ్లగా నేను ఇది మా ఇంటిలో తప్పనిసరిగా ఆచరించేలా చేస్తున్నాను. నగరంలోని ప్రతి కుటుంబమూ ఇదే రీతిలో చేయాలని కోరుతున్నాను’’ అని అన్నారు.

 
చక్కటి ఆహార ఎంపికల పట్ల అవగాహన కల్పించడంతో పాటుగా స్నాకింగ్‌ అలవాట్ల పరంగా కూడా అవగాహన కల్పించడమన్నది ఆరోగ్యవంతమైన జీవనశైలికి మార్గం వేస్తుంది. మరీముఖ్యంగా మన చుట్టూ ఉన్న ప్రపంచం మారుతున్న ప్రస్తుత సందర్భాలలో ఇది అవసరం. సమతుల్యమైన మరియు పోషకాలతో కూడిన డైట్స్‌పై దృష్టి కేంద్రీకరించడం అవసరం. దీనిలో ఓ గుప్పెడు బాదములు భాగంగా చేసుకోవాలి. దీనిలో పలు పోషకాలు అయినటువంటి విటమిన్‌ ఈ, మెగ్నీషియం, ప్రొటీన్‌, రిబోఫ్లావిన్‌, జింక్‌ మొదలైనవి ఉంటాయి. ఇవి సుదీర్ఘకాలంలో సంపూర్ణ ఆరోగ్యానికి తోడ్పడతాయి. కానీ వీటితో పాటుగా, మీ రోజువారీ జీవితంలో కొన్ని రకాల వ్యాయామాలను కూడా భాగం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. దీనితో పాటుగా ఈ సంక్షోభ సమయంలో మనల్ని మనం మార్చుకుంటున్న వేళ సానుకూల థృక్పధమూ నిర్వహించాల్సిన అవసరం ఉంది.

 
ఈ సదస్సులో షీలా కృష్ణ స్వామి, న్యూట్రిషన్‌ అండ్‌ వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ మాట్లాడుతూ, ‘‘భారతీయ కుటుంబాలలో గతానికన్నా మిన్నగా సరైన పౌష్టికాహారం తీసుకోవాల్సిన ఆవశ్యకత గురించి ఈ మహమ్మారి వెల్లడించింది. ఎంతోమంది భారతీయులు అత్యధిక రక్తపోటు, కార్డియోవాస్క్యులర్‌ వ్యాధులు (సీవీడీ), మధుమేహం మరియు ఊబకాయం లాంటి వాటితో ఇబ్బంది పడుతున్నారు. ఈ తరహా వ్యాధులే కోవిడ్‌ 19 రోగుల నడుమ మృత్యువుకూ కారణమవుతుంది.

 
ఒకవేళ మీరు ముందుగా పేర్కొనబడిన సమస్యలతో సతమవుతున్నా లేదంటే, ఆ ప్రమాద బారిన పడే అవకాశాలున్నా బాదం లాంటి  నట్స్‌ను మీ కుటుంబ మరియు మీ రోజువారీ డైట్‌లో భాగం చేసుకోవాలి. ఎందుకంటే ఇవి సమృద్ధిగా పోషకాలను కలిగి ఉంటాయి మరియు శరీరానికి తగిన పోషకాలనూ అందిస్తాయి. వీటితో పాటుగా బాదములలో రాగి, ఫోలేట్‌, ఇనుము, విటమిన్‌ ఈ వంటివి అధికంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తికి ఇవి తగిన మద్దతును ఇవి అందిస్తాయి. అందువల్ల, ఓ గుప్పెడు బాదములను మీ రోజువారీ డైట్‌లో భాగం చేసుకోవడాన్ని తప్పనిసరి చేసుకోండి!’’ అని అన్నారు.

 
ఈ కాలంలో మనలో చాలామంది అధిక సమయం కలిసే ఉంటున్నాము, అందువల్ల, కుటుంబ పోషకాహార, జీవనశైలి ప్రాధాన్యతలను పునఃసమీక్షించాల్సిన అవసరమూ ఉంది. తగిన మార్పులను జీవనశైలికి చేసుకుంటే, అది ప్రతి సభ్యుని ఆరోగ్యానికీ తగిన విలువనందిస్తుంది. కొద్ది మొత్తంలో డైటరీ, జీవనశైలి మార్పులను చేయడం, అంటే, పోషకాహార ఆహారాన్ని జోడించడం, ఓ గుప్పెడు బాదములను ప్రతి రోజూ తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం ద్వారా భారతదేశ వ్యాప్తంగా కుటుంబాలు ఆరోగ్యవంతమైన మార్పును తమ జీవితాలలో పొందగలరు మరియు తమ రోగనిరోధక శక్తినీ బలోపేతం చేసుకోగలరు. అదే సమయంలో ప్రస్తుత మహమ్మారి నుంచి తాము సురక్షితంగా ఉండేందుకు తగిన జాగ్రత్తలనూ తీసుకోవాల్సి ఉంది.