శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 4 మే 2018 (10:50 IST)

చేపలు తింటే.. మెదడు పనితీరు భేష్.. మానసిక ఆందోళనలు మటాష్

మెదడు చురుగ్గా పనిచేయాలంటే.. చేపలు ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చేపల్లో వుండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మెదడు అభివృద్ధికి తోడ్పడుతాయి. దెబ్బతిన్న నాడీవ్యవస్థను మరమ్మతు చేయడానికి

మెదడు చురుగ్గా పనిచేయాలంటే.. చేపలు ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చేపల్లో వుండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మెదడు అభివృద్ధికి తోడ్పడుతాయి. దెబ్బతిన్న నాడీవ్యవస్థను మరమ్మతు చేయడానికి చేపలు ఉపయోగపడతాయి. మానసిక ఒత్తిడితో ఇబ్బందులు పడుతున్న వారు చేపలు తింటే మానసిక ఆందోళనలను దూరం చేసుకోవచ్చు. 
 
ప్రస్తుతం ఒమేగా-3 సప్లిమెంట్లు అందుబాటులో వున్నా వాటిని పక్కనబెట్టి ఆహార రూపంలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మెదడు చురుగ్గా పనిచేయాలంటే.. చేపలతో పాటు ఫ్లాక్స్ సీడ్స్, డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. 
 
అలాగే ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగాలంటే.. యోగా, ధ్యానం వంటివి చేయాలి. వారంలో ఓ రోజు ఒత్తిడికి దూరంగా వుండాలి. రోజువారీ ఆలోచనలను పక్కనబెట్టేయాలి. సరదాగా గడపాలి. పాటలు వినాలి. ఒత్తిడి పెంచుకోకుండా ఉండాలి. రోజుకు రెండు నుంచి మూడు కప్పుల వరకు కాఫీ తాగొచ్చు.
 
మెదడు చురుగ్గా ఉండడానికి.. రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయమం లేదా శారీరక శ్రమ చేసేవారి మెదడు పనితీరు చురుగ్గా ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.