ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 12 జులై 2024 (23:37 IST)

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే ఏం జరుగుతుంది?

Ginger Lemon Water
అల్లం నీరు. అల్లం నీరు తాగితే జీర్ణ సమస్యలు తొలగుతాయి. పరగడుపున అల్లం నీరు తాగితే కలిగే లాభాలు, నష్టాలు వున్నాయి. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాము.
 
ఖాళీ కడుపుతో అల్లం ముక్కను నమలడం లేదా అల్లం నీటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది.
ఈ నీటిని తాగడం వల్ల మలబద్ధకం, గ్యాస్ తొలగిపోతాయి.
పీరియడ్స్ సమయంలో అల్లం ముక్కను నమలడం వల్ల నొప్పి, తిమ్మిరి తగ్గుతాయి.
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం తీసుకుంటే, చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.
ఖాళీ కడుపుతో అల్లం తీసుకోవడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది, ఇది బరువు తగ్గడానికి దారితీస్తుంది.
ఖాళీ కడుపుతో అల్లం లేదా అల్లం నీటిని తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.
గర్భిణీ స్త్రీలు అల్లం ఎక్కువ మోతాదులో తినకూడదు.
అధిక రక్తపోటు మందులు వేసుకునే వారు వైద్యుల సలహా మేరకు అల్లం వాడాలి.