బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 7 మార్చి 2019 (16:21 IST)

ప్రతిరోజూ జున్ను తింటే ఏమవుతుంది..?

పాలాధారిత ఉత్పత్తులు తీసుకుంటే బరువు పెరుగుతామన్న అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. కానీ, ఈ అభిప్రాయం తప్పు అంటున్నారు పరిశోధకులు. పాలాధారిత ఉత్పత్తులు తీసుకున్నంత మాత్రాన బరువు పెరగరన్న విషయం పరిశోధనలో వెల్లడైంది. 18 సంవత్సరాల నుండి 90 సంవత్సరాల వయసు గల సుమారు 1500 మంది ఆహారపు అలవాట్ల మీద సుదీర్ఘకాలం అధ్యయనం నిర్వహించారు. 
 
వీరందరు సాధారణ బరువు కంటే ఎక్కువగా ఉన్నారు. వీరిలో సగంమందికి ప్రతిరోజూ పాలాధారిత ఉత్పత్తులతో పాటు జున్ను కొద్దిగా ఎక్కువగా ఇచ్చారు. మిగిలిన సగం మందికి వారు రోజూ తీసుకునే ఆహారాన్నే అందించారు. కొన్ని రోజుల తరువాత పాలాధారిత ఉత్పత్తులు, జున్ను తీసుకునేవారి బరువును, ఆరోగ్యాన్ని పరిశీలించారు. 
 
వీరిలో 75 శాతం మంది బరువు పెరగకపోగా కొద్దిగా బరువు తగ్గిన విషయాన్ని గుర్తించారు. అయితే జున్ను తీసుకోవడం వలనే బరువు తగ్గుతారా.. లేదా అని భయపడుతున్నారా.. వద్దూ వద్దూ.. బరువు తగ్గాలనుకుంటే మాత్రం జున్ను తీసుకోండి.. ఫలితం ఉంటుంది. లేదంటే మీ ఇష్టం. 
 
ప్రతిరోజూ జున్నుతో తయారుచేసిన ఆహార పదార్థాలు తీసుకుంటే బరువు తప్పక తగ్గుతారని పరిశోధనలో తేలింది. కనుక మీరు రోజూ తినే ఆహారంలో కొద్దిగా జున్ను చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జున్నులోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ వంటి ఖనిజాలు చర్మాన్ని తాజాగా మార్చేలా చేస్తాయి. అంతేకాదు.. శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తుంది.