1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : మంగళవారం, 5 జులై 2016 (13:36 IST)

ఏసీకి అలవాటయ్యారో మీ పని గోవిందా! రోగనిరోధక శక్తి తగ్గిపోవడంతో అనారోగ్యాలే!

మనిషి చేతిలో ఫోన్ ఎంత అవసరమో ఇప్పుడు ఇంటికి ఏసీ కూడా అంతే అవసరంగా ఉంది. ఏసి మనుషుల జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందంటే ఇంట్లో, ఆఫీసులో, థియేటర్, హోటల్, కారులో ఇలా ప్రతిచోట ఏసి కావాలి. డబ్బులు ఎక్కువై

మనిషి చేతిలో ఫోన్ ఎంత అవసరమో ఇప్పుడు ఇంటికి ఏసీ కూడా అంతే అవసరంగా ఉంది. ఏసి మనుషుల జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందంటే ఇంట్లో, ఆఫీసులో, థియేటర్, హోటల్, కారులో ఇలా ప్రతిచోట ఏసి కావాలి. డబ్బులు ఎక్కువైనా ఫర్వాలేదు కానీ ఖచ్చితంగా ఇంట్లో ఏసి ఉండాలి. ఇప్పుడు ఏసి అనేది అవసరం మాత్రమే కాదు, ఒక స్టేటస్ సింబల్‌లా మారిపోయింది. అయితే ఈ ఏసి ఒంటికి ఎంత చల్లదనాన్ని ఇస్తుందో అంతేస్థాయిలో హాని కూడా కలిగిస్తుంది.
 
వేసవికాలంలో ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కోసం ఏసీ వాడటం చల్లదనమే కానీ.. దానిని అతిగా ఉపయోగించడం అనర్థాలకు దారితీస్తుంది. ఏసీని ఉపయోగించడమే కాదు.. దానిని రెగ్యూలర్‌గా సర్వీసింగ్ చేయించాలి. లేదంటే అందులో ఉండే దుమ్ము, ధూళి ఇంట్లోనే తిరుగుతూ అనారోగ్యానికి గురిచేస్తుంది.
 
ఎక్కువ సమయం ఏసిలో గడిపితే రోగనిరోధకశక్తి తగ్గుతూ ఉంటుంది. తరచుగా తలనొప్పి, జ్వరం లాంటి చిన్న సమస్యలతో పాటు, పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.
 
ఏసి అంటే కృత్రిమంగా వాతావరణాన్ని చల్లబరచుకోవడం. దీనివల్ల చర్మ కణాల పొడిగా మారుతుంది. పైన చర్మం చల్లగా ఉంటే సరిపోదు. శరీరం లోపల కూడా చల్లగా ఉండాలి. ఏసి వలన చర్మం చల్లగా ఉంటుంది కానీ, బాడి లోపల వేడి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.
 
ఏసిలో ఎక్కువగా గడిపితే స్వచ్ఛమైన బయటి గాలికి దూరమవుతారు. కాంటాక్ట్‌లెన్స్ వినియోగిస్తున్నవారికి, కంటి వ్యాధులున్న వారికి, ఆస్తమా రోగులకు ఏసీ కారణంగా సమస్య పెరిగే అవకాశం అధికంగా ఉంది.